సుధీర్: రష్మీ లేకుండా ఉండటం నావల్ల కాదు‘ఢీ’ షోలో హాట్ భామ రష్మీ-సుడిగాలి సుధీర్ మెంటర్స్ గ ఆంటున్నారు. అటు కంటిస్టెన్స్ తమ డ్యాన్స్ తో అలరిస్తే..వీళ్ళు మాత్రం డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో కామెడీ చేస్తూ నవ్విస్తుంటారు. అప్పుడప్పుడూ ప్రేక్షకులకు చిన్న సైజ్ రొమాన్స్ కూడా చూపిస్తారులెండి. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే..తాజాగా వచ్చిన ఢీ షో ఎపిసోడ్ లో ఏమైందో ఏమో కానీ షడన్ గా రష్మీ రాలేదు. దీంతో దాదాపు ఏడిచినంత పనిచేసిన సుధీర్ ను ఏమైందని ప్రశ్నించిన యాంకర్ ప్రదీప్ కు భారీ డైలాగ్స్ కొట్టాడు.

చిలుక లేకుండా గోరింక ఉంటుందా..? పుంజు లేకుండా పెట్ట ఉంటుందా..? అలాగే రష్మీ లేకుండా నేను ఎలా ఉండగలను భయ్యా..! అంటూ బోరుమన్నాడు. అయినా..రష్మీ ఎక్కడ ఉన్నా కూడా నా గురించే ఆలోచిస్తూ ఉంటుంది అంటూ డైలాగ్స్ కొట్టాడు. దీంతో అందరూ విరగబడి నవ్వుతున్న సమయంలో రష్మీ స్థానంలో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్లో సుధీర్ ను ఒక రేంజ్ లో ఆడుకుంది.

అయినా..ఒకతట్టు రష్మీ-సుధీర్ మధ్య ఏదో జరుగుతుందని అందరూ అనుకుంటున్న సమయంలో ఇలా పబ్లిక్ గానే రష్మీ లేకుండా నేను ఉండలేను మర్రో అంటూ సుధీర్ గోల చెయ్యడం వల్ల వీరిద్దరి గురించి గాసిప్పురాయుళ్ళు వార్తలు గుప్పించే పనిలో బిజీగా ఉన్నారు.

No comments

Powered by Blogger.