చిరు, పవన్‌ల మల్టీస్టారర్‌ మూవీ బడ్జెట్‌, పారితోషికాలు తెలిస్తే షాక్‌ అవుతారుమెగా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా మెగాస్టార్‌ చిరంజీవి మరియు పవన్‌ కళ్యాణ్‌లు కలిసి నటిస్తే చూడాలని కలలు కన్నారు. మెగా ఫ్యాన్స్‌ అయితే కనీసం చిన్న షాట్‌లో అయినా ఇద్దరిని కలిపి చూడాలని కోరుకున్నారు. అయితే మెగా ఫ్యాన్స్‌ కలను సుబ్బిరామిరెడ్డి నెరవేర్చేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే మెగా బ్రదర్స్‌ను ఒప్పించి త్రివిక్రమ్‌తో స్క్రిప్ట్‌ను సిద్దం చేయిస్తున్నాడు. భారీగా ఆస్తులు ఉన్న సుబ్బిరామిరెడ్డి మెగా బ్రదర్స్‌తో ఏకంగా 200 కోట్లు పెట్టి సినిమా తీసేందుకు ముందుకు వచ్చాడు.

వీరిద్దరిని ఒప్పించేందుకు సుబ్బిరామిరెడ్డి భారీ పారితోషికాన్ని ఆఫర్‌ చేసినట్లుగా తెలుస్తోంది. కేవలం మెగా బ్రదర్స్‌కు 100 కోట్లను కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఇద్దరికి కలిపి పారితోషికంగా 100 కోట్లు ఇవ్వనున్న సుబ్బిరామిరెడ్డి దర్శకుడు త్రివిక్రమ్‌కు 25 కోట్ల పారితోషికం ఇచ్చేందుకు కమిట్‌ అయినట్లుగా తెలుస్తోంది. ఇక మిగిలిన 75 కోట్లతో సినిమాను భారీగా రూపొందించనున్నాడు. 200 కోట్లకు బడ్జెట్‌ పెరిగినా పర్వాలేదని త్రివిక్రమ్‌తో నిర్మాత సుబ్బిరామిరెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులు మరియు సినీ పరిశ్రమ ఎప్పటికి గుర్తుంచుకునేలా సినిమా ఉండాలని సుబ్బిరామిరెడ్డి దర్శకుడు త్రివిక్రమ్‌ను కోరినట్లుగా తెలుస్తోంది. ఇదే సంవత్సరంలో ఈమెగా మల్టీస్టారర్‌ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

సుబ్బిరామిరెడ్డిపై ఉన్న గౌరవంతో పాటు ఆయన ఇచ్చే పారితోషికానికి మెగా హీరోలు లొంగిపోయి ఈ సినిమాను చేసేందుకు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. 200 కోట్లు పెట్టినా ఖచ్చితంగా ఈ సినిమా అంతకు మించి వసూళ్లు చేస్తుందని మెగా ఫ్యాన్స్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సుబ్బిరామిరెడ్డి మాత్రం లాభాల కోసం ఈ సినిమా చేయడం లేదని సన్నిహితుల వద్ద చెబుతున్నాడు. మొత్తానికి ‘బాహుబలి’, ‘ఖైదీ నెం.150’ చిత్రం తర్వాత మళ్లీ అంత క్రేజ్‌ ఈ సినిమాకు వచ్చే అవకాశాలున్నాయి. 

No comments

Powered by Blogger.