మీరు పుట్టిన డేట్ బేసి సంఖ్య అయితే ఏమవుతుంది ?న్యూమరాలజీ ప్రకారం.. మీరు పుట్టిన డేట్ చాలా విషయాలను, మీ వ్యక్తిత్వాన్ని చాలా వివరంగా సూచిస్తుంది. అయితే మీరు పుట్టిన డేట్ ని బట్టి.. మీరు వ్యక్తిత్వం తెలుసుకోవాలంటే.. ముందుగా మీరు పుట్టిన తేదీ, నెల, ఏడాది ఏ సంఖ్యలో గమనించాలి. అంటే బేసి(odd) సంఖ్యలా, సరి(even)సంఖ్యలా అనేది తెలుసుకోవాలి.

అయితే డేట్ ని, మంత్ ని, ఇయర్ ని మూడింటినీ సపరేట్ గా కూడిన తర్వాత వచ్చే అంకెను బట్టి.. బేసి సంఖ్యా, సరి సంఖ్యా అనేది డిసైడ్ చేయాలి. ఉదాహరణకు మీరు 14 నవంబర్ 1988న జన్మించారు అనుకుంటే..
1+4=5
1+1=2
1+9+8+8=26=2+6=8

దీని ప్రకారం మీ ఫైనల్ కాంబినేషన్ 5, 2, 8. ఇది బేసి సంఖ్య, సరి సంఖ్య, సరి సంఖ్య అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం మీ డేట్ ఆఫ్ బర్త్ ని క్యాల్యుకులేట్ చేసి.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఈ కింద వివరించిన వాటిని బట్టి తెలుసుకోండి.

బేసి, బేసి, బేసి

ఒకవేళ మీరు పుట్టిన తేదీ, నెల, ఏడాది.. మూడు బేసి సంఖ్యలే వస్తే.. మీ జీవితంలో ఎప్పుడూ బ్రైట్ సైడ్ నే చూస్తారు. చాలా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. ఆధ్మాత్మికంగా ఉంటారు. తెలివైనవాళ్లై ఉంటారు. ప్రేమ కోసమే బతుకుతారు. కానీ తరచుగా దానివల్ల బాధపడుతారు. బ్యాలెన్స్ చేయడంలో ఇబ్బందిపడతారు.

మూడ్ విషయంలో
ఎలాంటి కారణం లేకుండా ఫీలవడం వీళ్లకు అలవాటు. దీనివల్ల వాళ్ల మూడ్ పై ప్రభావం చూపుతుంది. వీళ్లు చాలా మంచి మనసు కలిగి ఉంటారు. చాలా సానుభూతి కలిగి ఉంటారు. కానీ వీళ్ల మూడ్ ఎప్పుడూ బాగుండేలా మెయింటెయిన్ చేయడం కష్టం. ఇతరులపై కోపంగా ఉన్నప్పుడు దాన్ని మరొకరిపై చూపే అవకాశం ఉంటుంది.

No comments

Powered by Blogger.