బండ్ల గణేష్ ఓ బ్రోకర్.. దుమారం రేపిన పవన్ బ్యూటీ ట్వీట్ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఓ ‘అమ్మాయిల బ్రోకర్’ అని ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ప్రచారం జరుగుతూ వస్తోంది. బడాబాబులకు అమ్మాయిలను సరఫరా చేసి.. బండ్ల క్యాష్ చేసుకున్నాడని, ఆ బిజినెస్ వల్లే స్టార్ హీరోలతో సినిమాలు చేసే పెద్ద నిర్మాతగా ఎదిగాడని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. ఇవన్నీ అవాస్తవాలని, ఓ మంచి కుటుంబం నుంచి వచ్చిన తాను ఎలాంటి అసభ్య కార్యకలాపాలకు పాల్పడలేదని రీసెంట్‌గా టీఎన్ఆర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

అయితే.. హీరోయిన్ మీరా చోప్రా మాత్రం పరోక్షంగా బండ్లపై కామెంట్స్ చేసింది. అతడు అమ్మాయిల బ్రోకరే అన్నట్లుగా ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పెట్టింది. ఇది నిజమేనని బండ్లకి శత్రువైన సచిన్ జోషి కూడా ట్విట్టర్‌లో స్పందించాడు. అతడో పెద్ద ఫ్రాడ్ అని, త్వరలోనే అతని బండారాల్ని బయటపెడతానని చెప్పుకొచ్చాడు. బండ్లగణేష్ లాంటి బ్రోకర్స్ చాలా డేంజర్ అని, అవసరమైతే వాళ్ల తమ ఫ్యామిలీని కూడా అమ్మేస్తారని విరుచుకుపడ్డాడు. ఇలాంటి వ్యక్తుల్ని బాయ్‌కాట్ చేయండంటూ పవన్‌కి ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు. త్వరలోనే ఓ లైవ్ ఇంటర్వ్యూలో బండ్ల నిజాల్ని నిగ్గు తేల్చుతానని పేర్కొన్నాడు.

ఇలా సచిన్ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తుండగా.. మీరా చోప్రా తాను బండ్లపై చేసిన ట్వీట్‌ని డిలీట్ చేయడం కొసమెరుపు. వారిద్దరి గొడవలో నేనెందుకు అనుకుని అమ్మడు ఆ ట్వీట్‌ని డిలీట్ చేసినట్లుంది. ఏదేమైనా.. బండ్లపై వీరు చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

No comments

Powered by Blogger.