ప్రెగ్నెన్సి సమయంలో సెక్స్ సురక్షితమేనా?


చాలామందికి అంతుచిక్కని ప్రశ్న ఇది. గర్భంతో ఉన్నప్పుడు సెక్స్ లో పాల్గొనవచ్చా? ఆ సమయంలో శృంగారం సురక్షితమేనా? ఏదైనా ఆపద ఉంటుందా? తల్లి, పిల్ల ఇద్దరు ప్రమాదంలో పడతారా? లేక కేవలం బిడ్డకే ప్రమాదామా? ఇలాంటివెన్నో ప్రశ్నలు మెదడులో మెదులుతాయి. వాటి సమాధనాలు ఇప్పుడు చూద్దాం.

ఆమ్నియోటిక్ శాక్ మరియు గర్భాశయం యొక్క కండరాలు పిండాన్ని సురక్షితంగా ఉంచడం వలన ప్రెగ్నెన్సి సమయంలో సెక్స్ అనేది బయట చెప్పుకున్నట్లుగా ప్రమాదకరమేమి కాదు. కాని, అది ఎప్పుడూ చేసే పద్ధతుల్లో ఉండకూడదు. ఎందుకంటే గర్భంతో ఉన్న మహిళ చాలా సెన్సిటివ్. తాను శక్తిని ఉపయోగించటం కష్టం. చివరి వారాల్లో అయితే సెక్స్ చేయకపోవటమే మంచిది. అందుకే ప్రగ్నెన్సిలో సెక్స్ వద్దని సూచిస్తారు.

ఓరల్ సెక్స్ కూడా అంత మంచి విషయం కాదు ప్రెగ్నెన్సిలో. ఇక్కడ ఓరల్ అంటే, యోనికి ఓరల్ సెక్స్ ఇవ్వడం. ఇలాంటి సమయాల్లో Air Embolism అనే సమస్య రావొచ్చు. అది తల్లికి బిడ్డకి మంచిది కాదు. ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి కాబట్టే ప్రెగ్నెన్సిలో సెక్స్ వద్దని అంటారు. ఎందుకంటే తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు అందరికి తెలిసి ఉండవు. అలాంటప్పుడు రిస్క్ తీసుకోకూడదు.

అంతేతప్ప, పిండానికి గర్భాశయానికి ప్రమాదం లేదు. స్త్రీ శరీరం అలా నిర్మించబడింది మరి. ఇంఫెక్షన్ల బెడద, ఆ సమయంలో మహిళల సున్నితత్వంని దృష్డిలో పెట్డుకోని చూస్తే మాత్రం, ప్రెగ్నెన్సిలో శృంగారం మంచి ఆప్షన్ కాదు.

No comments

Powered by Blogger.