రిపబ్లిక్ డే గిఫ్ట్..బి ఎస్ ఎన్ ఎల్ బంపర్ ఆఫర్..!జియో ఎఫెక్ట్ కు మిగతా టెలికాం కంపెనీలన్నీ బేజారెత్తిపోతున్నాయి. ఈ పోటీని తట్టుకోవడానికి ప్రభుత్వ రంగ సంస్థ బి ఎస్ ఎన్ ఎల్ కూడా దిగిరాక తప్పని పరిస్థితి. ఈ నేపధ్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అందులో భాగంగా బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం మూడు ఆఫర్లను ప్రవేశపెట్టింది. రూ.26తో రీఛార్జ్‌ చేయడం ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్‌ పరిధిలో 26గంటల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించడంతో పాటుగా ఈ ఆఫర్‌ ఈ రోజు అనగా జనవరి 25 నుంచి 31 వరకు అందుబాటులో ఉంటుంది.

ఇక రెండోది 'కాంబో 2601' పేరిట తీసుకొస్తున్న ఆఫర్‌లో రూ.2600తో రీఛార్జి చేసుకుంటే దానికి రూ.1300 అదనపు టాక్‌టైమ్‌ తోపాటుగా రూ.2600 మెయిన్‌ బ్యాలెన్స్‌లో జమచేస్తారు.అయితే దీని వ్యాలిడిటీ మూడునెలలు . 'కాంబో 6801' పేరిట తీసుకొస్తున్న ఆఫర్‌లో రూ. 6800తో రీఛార్జి చేసుకుంటే అంతేమొత్తం మెయిన్‌ బ్యాలెన్స్‌ రావడమే కాకుండా అదనంగా లభించే రూ.6800లు సెకండరీ అకౌంట్‌లో జమ అవుతుంది.దీని వ్యాలిడిటీ కూడా మూడు నెలలే .ఈ రెండు ఆఫర్స్ మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఛైర్మన్‌, ఎండీ అనుపమ్‌ శ్రీవాస్తవ తెలిపారు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఛైర్మన్‌, ఎండీ అనుపమ్‌ శ్రీవాస్తవ తెలిపారు.

No comments

Powered by Blogger.