ఈ లక్షణాలు మీలో ఉంటే నిద్రలోనే చనిపోతారంటజీవికి ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే ముఖ్యం. లేకుంటే, అనారోగ్యం కొనితెచ్చుకున్నట్లే. ‘నిద్ర’ సమస్య ‘ప్రాణాలు’ తీసేంత ప్రమాదకరం. అదేపనిగా నిద్రపోయినా, పనిలోపడి నిద్రపోక పోయినా... రెండూ డేంజరే. అందుకే, నిద్ర రాకున్నా, అతిగా నిద్రవస్తున్నా తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. ఆరోగ్యకరమైన వ్యక్తిలో బ్లడ్ ఆక్సిజన్ శాతం 95 నుంచి 100 శాతం ఉండాలి. అది ఏ మాత్రం తగ్గినా గుండె ఆగిపోతుంది. ఆక్సిజన్ అందకపోవడం వల్ల మెదడులోని కణాలు నశిస్తాయి. దీంతో, నిద్రలోనే చనిపోతారు.


మరి, వీటిని గుర్తించడం ఎలా? : నిద్రలేమి, గురక, నిద్రలో శ్వాస అందకపోవడవం వంటి సమస్యలను ఎదుర్కొనేవారికి ‘స్లీప్ టెస్ట్’ అందుబాటులో ఉంది. ఇంట్లో లేదా ల్యాబ్‌లో ఈ పరీక్షలు జరిపించుకోవచ్చు. మొదడు పనితీరు తెలుసుకోవడం కోసం ముఖానికి, శ్వాసక్రియను పరీక్షించడానికి ముక్కుకు, ఊపిరి సామర్థ్యం కోసం చాతి, నడుముల వద్ద సెన్సార్లను అమరుస్తారు. రక్తంలో ఆక్సిజన్ కొలిచేందుకు చేతి వెళ్లకు కూడా సెన్సార్లు పెడతారు. ఆ వైర్లను కంప్యూటర్‌కు అనుసంధించి.. ఒక రాత్రంతా రోగిని పరీక్షిస్తారు.


పెద్దల్లో అధికం: సీనియర్ న్యూరాలజిస్ట్, స్లీప్ స్పెషలిస్ట్ డాక్టర్ మన్వీర్ భటియా తెలిపిన వివరాల ప్రకారం.. స్లీప్ అప్నియా అనేది పెద్దల్లో అధికంగా వస్తుంది. ఊబకాయం, మద్యపానం చేసేవారిలో ఇది మరీ ఎక్కువ. అలాగే, నిద్రలేమి కూడా చాలా మందిని వేధించే సమస్య.

ప్యాసింజర్ రైళ్లను నడిపే ఆపరేటర్లంతా తప్పనిసరిగా ‘స్లీప్ అప్నీయా’ పరీక్షలు చేయించుకోవాలనే నిబంధన పెట్టింది. ఓ రైలు ఆపరేటర్ నిద్రలో ఉండి.. భారీ ప్రమాదానికి కారణమయ్యాడు. అప్పటి నుంచి ఈ నిబంధన అమలు చేస్తున్నారు.


నిద్రలో ‘ఊపిరి’ ఆడకపోతే డేంజరే: సీనియర్ చెస్ట్ పిజీషియన్ డాక్టర్ ఆరూప్ బసు మాట్లాడుతూ.. ‘‘నిద్రలో 5 నుంచి 10 సార్లు తక్కువ శ్వాస తీసుకుంటే బోర్డర్. పది నుంచి 30 సార్లయితే.. స్లీప్ అప్నీయాతో బాధపడుతున్నట్లు గుర్తిస్తాం. అదే 30 సార్లకంటే ఎక్కువ సార్లు ఊపిరి తీసుకోవడం కష్టమైతే.. అది చాలా తీవ్రమైన సమస్య. ఈ సమస్య ఉన్నవారికి Continuous positive airway pressure (CPAP) లేదా Bilevel positive airway pressure (BiPAP) ద్వారా శ్వాస అందిస్తాం. బ్రిటన్‌లో నమోదవుతున్న ఆకస్మిక మరణాల్లో.. ఆల్కహాల్ తర్వాత స్లీప్ అప్నీయా బాధితులే ఎక్కువగా ఉన్నారు’’.


నిద్రలేమితో ‘ఇన్సోమియా’: ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ మంజరీ త్రిపాఠి మాట్లాడుతూ.. ‘‘టీనేజర్లు నిద్రపోవల్సిన సమయంలో వెబ్‌సైట్ల సర్ఫింగ్, ఫ్రెండ్స్‌తో చాటింగ్, ఫోన్లతో బిజీగా ఉంటున్నారు. కొంతమంది యువ ఉద్యోగులు పని ముగించుకుని రాత్రివేళ్లలో నిద్ర మానుకుని పార్టీలకు సమయం కేటాయిస్తున్నారు. దీనివల్ల ‘ఇన్సోమియా’ ఏర్పడుతుంది. ఇటువంటి వారిలో న్యూరోలాజికల్ సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించాం’’ అని తెలిపారు.

Readమీరు పుట్టిన డేట్ బేసి సంఖ్య అయితే ఏమవుతుంది ?

No comments

Powered by Blogger.