ఆమెను చిన్నప్పటి నుంచే 43000 సార్లు రేప్ చేసారు...ఆ తరువాత ఏం జరిగిందంటే...!
ఆమెదో విషాద గాధ. ఆమె 43000 సార్లు అత్యాచారానికి గురయింది. ఆమె కు 12 నుంచి 16 సంవత్సరాల వయసు మధ్యలో ఈ అత్యాచారం గావించబడింది. ఆమెను రోజుకు 30 సార్లు అత్యాచారం చేసారు. ఆమె ఒకప్పుడు వేశ్య గా తన జీవితాన్ని సాగించింది. కాని ఆమె ఇప్పుడొక మానవ హక్కుల కార్యకర్తగా పోరాడుతోంది. వివరాల్లోకి వెళ్తే మెక్సికో కు చెందిన కార్లా జాసింటో ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆమె బంధువు లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు. అప్పుడు ఆమెకొక వేశ్యా గృహం నడిపే యువతి తారసపడింది. నేను కూడా నీలాగే చిన్నప్పుడు లైంగిక వేదింపులకు గురయ్యానని మాయ మాటలు చెప్పి తనతో పాటు తీసుకొని వెళ్ళింది.
తరువాతి మూడు నెలల కార్లా జీవితం చాలా బాగుంది. కొత్త బట్టలు, బహుమతులు, చాకోలేట్స్ అన్నీ ఇస్తూ మహారాణిలా చూసుకునేవారు. ఆ తరువాత ప్రారంభమయింది అసలు నరకం. ఆమెను డబ్బుల కోసం వేశ్యా వృత్తిలోకి దింపారు. మెక్సికో లోని అతి పెద్ద నగరమైన గౌదలజర లో ఆమె వేశ్య గా మారిపోయింది. ఆమె దగ్గర సుఖం పొందే విటుల్లో పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, మతాధిపతులు ఉండేవారని చెప్పుకొచ్చింది. 2008 లో ఒక స్వచ్చంద సంస్థ ద్వారా ఆ నరకం నుంచి బయట పడ్డ ఆమె ఇప్పుడు ప్రపంచం మొత్తం తిరుగుతూ వేశ్యా వృత్తి లో బలవంతంగా చేర్చబడిన మహిళలకు ఆ రొంపి లోంచి బయటపడేందుకు తనవంతు సాయం చేస్తోంది.
No comments