షాక్‌: యూ ట్యూబ్‌లో ధృవ సినిమా


మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ధృవ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండు రోజుల‌కు రూ. 15 కోట్ల షేర్ సాధించింది. విడుదలయిన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 22.5 కోట్ల రూపాయలు సాధించి నిర్మాతకు కాసుల వర్షం కురిపిస్తోంది.

మెగా ఫ్యాన్స్ ఈ రికార్డుల‌ను ఎంజాయ్ చేస్తుంటే వారికి ఓ షాకింగ్ న్యూస్ త‌గిలింది. ధృవ రికార్డుల‌ను ఎంజాయ్ చేస్తోన్న మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆనందాన్ని పైరసీ భూతం ఆవిరి చేసింది. గత రాత్రి యూట్యూబ్‌లో గుర్తుతెలియని పైరసీ నేరగాళ్లు ధృవ సినిమాను పోస్ట్ చేశారు. ఈ పరిణామంతో మెగా ఫ్యాన్స్ కంగుతిన్నారు.

ఈ వీడియోను అప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మంది చూసేశారు. వెంట‌నే తేరుకున్న ధృవ చిత్ర యూనిట్ యాంటీ పైరసీ టీంతో మాట్లాడి ధృవ పైరసీని తొలగించారు. సినిమా విడుదలకు ముందు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా విడుదలయ్యాక మాత్రం ఈ పైరసీని నియంత్రిచడంలో సినీ ప్రముఖులు విఫలమవుతున్నారు. తాజా సంఘ‌ట‌న‌తో నిర్మాత అల్లు అర‌వింద్ ధృవ సోష‌ల్ మీడియాలో ఎక్క‌డా లీక్ కాకుండా మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

No comments

Powered by Blogger.