2 నెలల్లో 10 కేజీల బరువు తగ్గే సింపుల్ చిట్కా
ప్రస్తుతం స్థూలకాయం ప్రపంచాన్ని పట్టిపీడుస్తోంది. ఈ ఒక్క సమస్య పలు రోగాలకు కారణమవుతోంది. దీంతో స్థూలకాయం, అధిక బరువును తగ్గించుకునేందుకు కొందరు వైద్యులను ఆశ్రయిస్తుంటే మరికొందరు రోజువారీ వ్యాయామాలు, చిట్కాలను పాటిస్తూ బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే స్థూలకాయం తగ్గేందుకు చైనా వైద్యులు మాత్రం ఓ సరికొత్త పద్ధతిని ప్రవేశపెట్టి ఓ వ్యక్తి బరువును రెండు నెలల్లో ఏకంగా పది కిలోలు తగ్గించి రికార్డు సృష్టించారు. బీజింగ్‌కు చెందిన లీ కన్ 80 కేజీల బరువుతో బాధపడుతున్నాడు. దీంతో అతడికి కిడ్నీ సమస్యలు మొదలయ్యాయి. వైద్యుల వద్దకు వెళితే బరువు తగ్గాలని సూచించారు. అయితే ఆయన చేసిన ప్రయత్నాలన్నీవిఫలమయ్యాయి.
చివరకు చెంగ్డులోని సెకండ్ పీపుల్స్ ఆస్పత్రి సరికొత్త విధానం ద్వారా అతడి బరువును తగ్గించేందుకు ప్రయత్నించి విజయం సాధించింది. లీ కన్ పొట్టలోని ధమనిని బ్లాక్ చేయడం ‘హంగర్ హార్మోన్’ను పస్తులుంచారు. ఈ పద్ధతి విజయవంతం కావడంతో లీకన్ రెండు నెలల్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా పది కిలోల బరువు తగ్గాడు.
లీకన్ పొట్టలోని ధమనిని గెలటిన్(జిగురు పదార్థము)ను ఉపయోగించి మూసివేశారు. ఈ విధానం గ్యాస్ట్రిక్ ఆపరేషన్ కంటే సులభమైనదే కాక రక్తస్రావం కాకుండా, ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుందని ప్రభుత్వ అధికారిక పత్రిక జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ధమనులను బ్లాక్ చేయడం వల్ల ఆకలిని కలిగించే హార్మోన్ల విడుదల తగ్గిపోతుంది. ఫలితంగా ఎప్పుడూ కడుపు నిండుగా ఉన్నట్టే అనిపిస్తుంది. లీ ఈ విధానం ద్వారానే పది కేజీల బరువు సింపుల్‌గా తగ్గిపోయాడు.
No comments