ఈ ఆలయాన్ని దయ్యాలు కట్టాయి అంట .. ఈ కధేంటో కాస్త చూడండి..!
కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని అందరికీ ఆతృతగా ఉంటుంది. కొంతమంది వాటి కోసం వెతుకుతుంటారు. అయితే వింత గొలిపే ఈ కధేంటో చూడండి. అందరికీ దెయ్యమంటే భయం. మరి దెయ్యాలకు ఎవరంటే భయం. ఈ విషయం విన్నాక దెయ్యానికి ఎవరంటే భయమో మీరే చెప్తారు. కర్ణాటకలోని దొడ్డ బల్లాపురం దేవనహళ్లి మార్గమధ్యంలో ఉన్న బొమ్మవర సుందరేశ్వర ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయట. అసలు మ్యాటర్ ఏంటంటే 600 సంవత్సరాల క్రితం ఈ ఊరిలో దెయ్యాల బుచ్చయ్య అనే దెయ్యాల మాంత్రికుడు ఉండేవాడట. అప్పట్లో ఊరినిండా దెయ్యాలే ఉండేవట. ఓ ఆలయం నిర్మిద్దామని ఆ మాంత్రికుడు భావించి నిర్మిస్తే రాత్రికి రాత్రే ఆ ఆలయాన్ని కూలదోసాయట దెయ్యాలు. కోపంతో రగిలిపోయిన మాంత్రికుడు తన శక్తులతో ఆ దెయ్యాలను వశపరచుకొని వాటి జుట్టు కత్తిరించి తన దగ్గర రోకలికి కట్టి పెట్టుకున్నాడట.
తమ జుట్టు తమకివ్వమని ఆ దెయ్యాలు మొరపెట్టుకోగా ఆ దేవాలయాన్ని యదావిధిగా నిర్మించమని ఆదేశించాడట. మాంత్రికుడి ఆజ్ఞ మేరకు ఆ దెయ్యాలు ఆలయాన్ని నిర్మించాయట. ఇప్పటివరకు మనం చూసిన గుడులపై దేవతల బొమ్మలు,కామ సూత్ర బొమ్మలు కనిపిస్తాయి. కాని ఈ గుడిపై దెయ్యాల బొమ్మలు కనిపిస్తాయి. దెయ్యాలు కట్టిన గుడి కనుక ఈ ఆలయంపై వాటి బొమ్మలు నిర్మించబడ్డాయి అంటుంటారు. గత 50 సంవత్సరాల వరకు గర్భగుడి ఖాళీగానే ఉందట. అయితే 50 సంవత్సరాల క్రితం గ్రామ శివార్లలోని చెరువు తవ్వుతుండగా 8 అడుగుల శివలింగం లభించిందట. ఆ శివలింగాన్ని ఖాళీగా ఉన్న దేవాలయంలో ప్రతిష్టించి సుందరేశ్వర దేవాలయంగా నామకరణం చేసారట... ఇంత ఎత్తైన లింగం రాష్ట్రంలో ఎక్కడా లేదని దేశంలో ఇటువంట ఎత్తైన లింగాలు నాలుగు లేదా 5 ఉంటాయని గ్రామస్తులు చెబుతున్నారు.
No comments