పెళ్లిచూపుల మధ్యలో వచ్చి అమ్మాయికి ప్రియుడి లిప్ కిస్.. ఆ తరువాత
తను ప్రేమించిన అమ్మాయి ఎక్కడ తనకు దక్కకుండా పోతుందేమోనని ఒక అబ్బాయి చేసిన పని ఆ కుటుంబాన్ని ఆశ్చర్యపరిచింది. తను ప్రేయసికి పెళ్లి చూపులు జరుగుతుండగా వాళ్ళ ఇంటికి వెళ్లి అమ్మాయిని ఒక్కసారిగా అదరచుంబనం తో రెచ్చిపోయాడు. వివరాలలోకి వెళితే విశాఖ జిల్లాలోని బక్కన్న పాలెం గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అతని పెద్ద కుమార్తెకు శుక్రవారం పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. పెళ్లిచూపులు జరుగుతున్న సమయంలో అదే ప్రాంతంలో ఉంటున్న ఓ బడా ఫ్యామిలీకి చెందిన యువకుడు అక్కడకు వచ్చి అందరి ముందు అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో అక్కడ ..
ఉన్నవారంతా అవాక్కయ్యారు. ఇదంతా చూసి పెళ్లిచూపులకు వచ్చిన మగపెళ్లివారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ముద్దు పెట్టుకున్న యువకుడు.. తన తల్లిదండ్రులను ఒప్పించి అమ్మాయిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. యువకుడి తల్లిదండ్రులను వివాహానికి ఒప్పుకోవడంతో కథ సుఖాంతమైంది.
No comments