ఇవి మీ ఇంట్లో కనుక ఉంటే అర్జెంటు గా తీసేయండి
కొన్ని పెయింటింగ్స్ మరియు బొమ్మలు ఇంట్లో ఉండకూడదు. ఉంటె చెడు జరుగుతుందన్న నమ్మకం. ఇవి మీ ఇంట్లో కనుక ఉంటే అర్జెంటు గా తీసేయండి.
తాజ్ మహల్
పెయింటింగ్ ను ఇష్టపడే వారే కాకుండా ఎంతో మంది ప్రేమికులు సైతం తాజ్ మహల్ ను ఇష్టపడుతారు. చాలా మంది తాజ్ మహల్ పెయిటింగ్ ను తమ ఇళ్ళలో కూడా పెట్టుకుంటారు. ప్రేమకు చిహ్నమైనప్పటికీ షాజహాన్ తన భార్య ముంతాజ్ సమాధి గా ఇది నిర్మించబడింది. అది ఒక సమాధి కావడం వలన దీనిని ఇళ్ళలో పెట్టుకోవడం ద్వారా చెడు ఫలితాలు ఉంటాయని అందుకే ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు.
యుద్ద సన్నివేశాలు
యుద్ధం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది రామాయణ మహాభారతాల యుద్ద సన్నివేశాలు. ఈ యుద్ధం ద్వారా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే రామాయణ మహాభారతాల నుంచి యుద్ధ సన్నివేశాల పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకోకూడదని, ఇవి దాయదుల మధ్య ఎప్పటికీ అంతం కాని పోరును సూచిస్తాయని అంటున్నారు.
పారే జలపాతం
పెయింటింగ్ ను ఇష్టపడే వారిలో పారే జలపాతం పెయింటింగ్స్ ను ఇష్టపడని వారు ఉండరని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పెయింటింగ్స్ ఇష్టపడని వారిని కూడా ఈ పెయింటింగ్ యిట్టె ఆకర్షిస్తాయి. అయితే పారే జలపాతం పెయింటింగ్స్ గాని, ఫౌంటైన్స్ పెయింటింగ్స్ గాని ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి పేదరికాన్ని సూచిస్తాయి. మీకు వచ్చిన సంపద గుర్తింపు ఎక్కువ కాలం నిలువకూడదు అని సూచిస్తాయని చెబుతున్నారు.
మునుగుతున్న ఓడ
కుటుంబ సభ్యులు అంతా కలిసిమెలిసి ఉండటం ద్వారా ఇల్లు ఎప్పుడు కళకలలాడుతూ ఉంటుంది. అయితే ఇళ్ళలో ఇలా మునిగిపోతున్న ఓడ పెయింటింగ్స్ పెట్టుకోవడం ద్వారా కుటుంబ సభ్యుల మద్య అంతరాలను పెంచడం అనే అంశాన్ని సూచిస్తోందట. ఇటువంటి వాటిని ఇళ్ళలో పెట్టుకోకపోవడం మంచిది.
నటరాజ పెయింటింగ్
డాన్స్ ను ఇష్టపడే వారి ఇళ్ళలో కనిపించే పెయింటింగ్ లలో ఎక్కువగా కనిపించేది ఏదైనా ఉంది అంటే అది నటరాజ పెయింటింగ్. ప్రతీ క్లాసికల్ డ్యాన్సర్ ఇళ్ళల్లో ఇది ఉంటుంది. ఇది మంచి కళాత్మకంగా ఉన్నప్పటికీ వినాశనాన్ని సూచిస్తుంది. తాండవ నృత్యం అంటే వినాశనానికి నిదర్శనం అనే అంశాన్ని సూచిస్తుంది. అందుకే ఈ పెయింటింగ్ ఇంట్లో పెట్టుకోవడం అంత మంచిది కాదు.
ఏడుస్తున్న బాలుడు
పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. వారు నవ్వుతూ ఉంటేనే ఇంటికి కూడా ఎంతో కల. అయితే ఈ మధ్య ఏడుస్తున్న బాలుడు బాలిక పెయింటింగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. అయితే ఇవి దురదృష్టానికి సూచికలు. ఇటువంటి వాటిని ఇళ్ళలో పెట్టుకోకూడదు.
క్రూర జంతువులు
జంతువులలో క్రూరమైన జంతువులు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేవి పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, తోడేళ్ళు. వీటి పెయింటింగ్స్ ను ఇళ్ళలో పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఇవి క్రూరత్వానికి నిదర్శనం. ఇటువంటి వాటి పెయింటింగ్స్ ను ఇళ్ళలో పెట్టుకోవడం ద్వారా అవి మనుషుల్లోని హింసా ప్రవృత్తిని సూచిస్తాయి. అందువల్ల ఇటువంటి పెయింటింగ్స్ మీ ఇంట్లో ఉంటే వెంటనే బయట పడేయండి.
No comments