బిగ్ షాక్‌: శింబును గుళ్లో సీక్రెట్ మ్యారేజ్‌ చేసుక‌న్న స్టార్ హీరోయిన్‌ఈ హెడ్డింగ్ నిజంగా షాక్‌ల‌కే బిగ్ షాక్‌… సౌత్ ఇండియ‌న్ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌, కోలీవుడ్ యంగ్ హీరో శింబు సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. ఇది నిజం.. ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారానికి ముందు.. తమిళ స్టార్ హీరో శింబుతో నయనతార ప్రేమ వ్యవహారం నడిపిన సంగతి తెలిసిందే. వారి ప్రేమ పెళ్లి వ‌ర‌కు వెళ్లి త‌ర్వాత కంచికి చేరింది. అయితే.. తాజాగా వారిద్దరు ఒక్కటయ్యారు. పెళ్లిచేసుకున్నారు. గుళ్లో మూడు ముళ్ల బంధంతో దగ్గరయ్యారు.
ఇదంతా నిజం అని మీరు న‌మ్మ‌వ‌ద్దు సుమా..? గ‌తంలో ఈ జంట‌ కలిసి వల్లభ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత వారిద్ద‌రు క‌లిసి స‌ర‌సుడు సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార ఓ హీరోయిన్ కాగా.. ఆండ్రియా, ఆదాశర్మ మరో ఇద్దరు హీరోయిన్లు. ఈ సినిమాకు హిట్ చిత్రాల దర్శకుడు పాండిరాజ్‌ డైరెక్షన్ చేస్తున్నాడు.

శింబు సినీ ఆర్ట్స్‌ పతాకంపై శింబు తండ్రి టి.రాజేందర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. గ‌తేడాదే తమిళంలో ‘ఇదు నమ్మ ఆళ్‌’గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. ఐటీ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ప్రేమ కథగా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది.
ప్ర‌స్తుతం తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. వాలెంటైన్స్ డే కానుకగా ఆడియోను..ఈ నెల‌లోనే సినిమాను రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమాకు శింబు తమ్ముడు కురళ అరసన్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌.

No comments

Powered by Blogger.