భూమి వైపు దూసుకొస్తున్న ఏడు గ్రహాలు.. 2017 అక్టోబర్‌ లో భూమి అంతం?గతంలో భూమి అంతం కానుందని చాలాసార్లు ప్రచారాలు జరిగినా భారీ భూకంపాలు ఇతర విపత్తులు తప్ప భూమి అంతం కాలేదు. ఇప్పుడు మరోసారి 2017 అక్టోబర్ లో భూమి అంతం కానుందని కొత్త ప్రచారం ఊపందుకుంది. 2017 అక్టోబర్ లో భూమి అంతరించిపోతుందనే విషయాన్ని డేవిడ్ మీడే అనే రచయిత 'ప్లానెట్ టెన్ - ది 2017 అరైవల్' అనే పుస్తకంలో వెల్లడించారు. కుట్ర సిద్ధాంత కర్తలుగా పేర్కొనే కొందరు.. వందేళ్ల క్రితం కక్ష్యలోని ఇతర గ్రహాలను నిబిరు అనే గ్రహం విచ్ఛిన్నం చేసిందని.. ఇది సౌరవ్యవస్థలో పదో గ్రహమని చెబుతున్నారు. ఇప్పుడు భూమికి దక్షిణ ధ్రువం వైపు నుంచి దూసుకొస్తోందని.. తన లాంటి మరో మరో ఏడు విచ్ఛిన్న గ్రహాలను కూడా వెంటబెట్టుకొని వస్తోందని చెబుతున్నారు.

గురుత్వాకర్షణ ప్రభావం నుండి సౌర వ్యవస్థ నుంచి బయటపడిన ఈ గ్రహం 2017 అక్టోబర్ లో భూమిని తాకే అవకాశముందని.. ఇలాగే జరుగుతుందని చెప్పేందుకు సరిపడే సరైన ఆధారాలు లేవని డేవిడ్ మీడే వెల్లడించారు. ఈ నిబిరు గ్రహం ఈ దిశలో వస్తుందో చెప్పడం కష్టమని దక్షిణ అమెరికాలోని ఎత్తైన ప్రదేశాల్లో అత్యాధునిక కెమెరాలు అమర్చి అధ్యయనం చేస్తే ఇది భూమిని ఈ దిశగా వచ్చి ధీ కొడుతుందో తెలుస్తుందని ఆయన అన్నారు. అలానే..

మతబోధకులు బైబిల్ లో కూడా ఈ విషయం ఉందని చెప్పడం విశేషం. ప్రపంచం అంతరించి పోతుందని 2003, 2012, 2015లో ఎన్నో పుకార్లు వచ్చాయని.. ఇది కూడా లాంటిదే అని నాసా కొట్టిపడేసింది.

No comments

Powered by Blogger.