ఎయిర్‌టెల్ యూజ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌… 12 నెల‌ల పాటు నెల‌కు 4జీబీ డేటా ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ..!



రిల‌య‌న్స్ జియో… ఈ పేరు వింటేనే ఇత‌ర టెలికాం ఆప‌రేట‌ర్ల‌కు గుండెల్లో గుబులు పుడుతోంది. ఉచిత కాల్స్, ఎస్ఎంఎస్‌, ఇంట‌ర్నెట్ అంటూ ఒక్క‌సారిగా జియో రంగంలోకి దిగే స‌రికి ఇత‌ర అన్ని టెలికాం కంపెనీల‌కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ఈ క్ర‌మంలో త‌మ త‌మ నెట్‌వ‌ర్క్‌ల నుంచి జియోకు మారుతున్న వినియోగదారుల‌ను త‌మ వైపు తిప్పుకునేందుకు ఆయా కంపెనీలు ఎన్నో ఆఫ‌ర్ల‌ను ఇప్ప‌టికే ప్ర‌క‌టించేశాయి. అయితే ఎయిర్‌టెల్ మాత్రం తాజాగా ఓ వినూత్న‌మైన బంప‌ర్ ఆఫ‌ర్‌తో వినియోగ‌దారుల‌ను త‌న వైపు తిప్పుకునేందుకు స్కెచ్ వేసింది. అదేమిటంటే…

కొత్త‌గా 4జీ ఫోన్స్ కొన్న‌వారు, వేరే నెట్‌వ‌ర్క్‌ల నుంచి ఎయిర్‌టెల్‌కు ఎంఎన్‌పీ ద్వారా మారుతున్న వారు లేదంటే ఎయిర్‌టెల్‌లోనే కొత్త సిమ్ క‌నెక్ష‌న్ తీసుకునే వారు రూ.349తో రీచార్జ్ చేసుకుంటే చాలు. దాంతో 1+3 జీబీ మొత్తం 4జీబీ 3జీ లేదా 4జీ డేటా ఉచితంగా ల‌భిస్తోంది. అంతేకాదు, ఏ నెట్‌వ‌ర్క్‌కైనా ఉచిత వాయిస్ కాల్స్ అన్‌లిమిటెడ్‌గా ల‌భించ‌నున్నాయి. అయితే ఇవి 28 రోజుల వ‌ర‌కు వ్యాలిడిటీ ఉంటాయి. త‌రువాత మళ్లీ రూ.349తో రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. అలా డిసెంబ‌ర్ 31, 2017 వ‌ర‌కు గ‌రిష్టంగా 13 సార్లు ఈ ప్యాక్‌ను ప్రీపెయిడ్ యూజ‌ర్లు రీచార్జి చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో ఈ ఆఫ‌ర్‌ను వినియోగించుకోవ‌డానికి చివ‌రి తేదీగా ఫిబ్ర‌వ‌రి 28ని ఎయిర్‌టెల్ నిర్ణ‌యించింది. అయితే మొద‌టి సారి వ‌చ్చే 3జీబీ ఉచిత డేటాను మాత్రం యూజ‌ర్లు ఎయిర్‌టెల్ మై యాప్ ద్వారా క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంత‌రం ఇక మ‌ళ్లీ చేయించే 12 రీచార్జిల‌లో ఇన్‌స్టంట్‌గా 4జీబీ డేటా అప్ప‌టిక‌ప్పుడే వ‌స్తుంది.

అయితే ఎయిర్‌టెల్ ప్ర‌వేశపెట్టిన ఈ బంప‌ర్ ఆఫ‌ర్ కేవ‌లం ప్రీపెయిడ్ యూజ‌ర్ల‌కే కాదు, పోస్ట్‌పెయిడ్ యూజ‌ర్ల‌కు కూడా వ‌ర్తించ‌నుంది. అందుకు వారు ఏం చేయాలంటే ఎయిర్‌టెల్ మై ప్లాన్ ఇన్ఫినిటీ ప్లాన్‌ను యాక్టివేట్ లేదా అప్‌గ్రేడ్ చేయించుకోవాలి. అప్పుడు వారికి కూడా పైన చెప్పిన విధంగా ఆఫ‌ర్లు ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలో ఎయిర్‌టెల్ దాదాపుగా 12 నెల‌ల పాటు నెల‌కు 4జీబీ 3జీ / 4జీ డేటాను యూజ‌ర్ల‌కు ఉచితంగా అందించ‌నుంది. అయితే జియో అందిస్తున్న ఆఫ‌ర్ రూ.299లో మొత్తం 6 జీబీ డేటా వ‌స్తోంది. ఇందులో 2జీబీ సిమ్ ద్వారా, 4జీబీ జియో నెట్ వైఫై ద్వారా అందుతోంది. అయితే రెండు ఆఫ‌ర్ల‌ను పోలిస్తే జియోది పైచేయిగా క‌నిపిస్తున్నా ఆ సంస్థ‌కు చెందిన జియో నెట్ వైఫై రూట‌ర్లు ఇంకా అందుబాటులోకి రాక‌పోవ‌డంతో ఈ విష‌యంలో ఎయిర్‌టెల్ త‌న రూ.349 ప్యాక్‌తో జియోకు గ‌ట్టిపోటీ ఇచ్చింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో ఈ ప్యాక్ ప‌ట్ల వినియోగ‌దారుల స్పంద‌న ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి..!

No comments

Powered by Blogger.