దేవుడి పాదాల నుంచి నీరు కారుతుందని తాగేశారు..చివరకు ఏం తాగారో తెలిసి ఉరేసుకున్నారు..!


2016 నవంబర్ 17 న ముంబై లోని కరోడి అనే గ్రామంలో ఒక అద్భుతం జరిగింది. అక్కడ సెయింట్ ఆంతోనీస్ పారిస్ కు చెందినా చర్చ్ బయట ఉన్న జీసస్ క్రైస్ట్ విగ్రహం కాలి నుండి నీరు రావడం ప్రారంభం అయింది. అది గమనించిన స్థానికులు సంబ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఇది జీసస్ చేసిన మిరాకిల్ అని ప్రచారం జరిగింది. ఆ వింతను చూడడానికి ముంబై నుంచి బయట ప్రాంతాల వారు కూడా చాలామంది వచ్చారు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా పాకి రెండు రోజుల్లోనే వేల సంఖ్యలో ప్రజలు అక్కడికి రావడంతో పోలీస్ సెక్యురిటీ మీడియా కవరేజ్ కూడా వచ్చింది. ఆ పవిత్ర జలాన్ని చాలామంది తల మీద జల్లుకొని దాన్ని తీర్ధంలా తాగి ఇంకా బాటిల్స్ లో కూడా పట్టుకొని మరీ వెళ్ళారు.

ఆ సమయంలో ఆ చిత్రాలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వింత దేవుడే చేసాడని అది దేవుడి గొప్పతనం అని చాలామంది ప్రచారం చేసారు. దేవుడు ఉన్నాడని చెప్పడానికి కూడా ఇదే ప్రూఫ్ అని ప్రచారం కూడా జరిగింది. ఇలా ఆ ప్లేస్ బాగా పాపులర్ అయింది. అయితే ఆ వింత మీద రీసెర్చ్ చేయడానికి ఫిన్లాండ్ నుంచి ఒక సైంటిస్ట్ వచ్చారు.

ఆయన రీసెర్చ్ చేసి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఆయన చేసిన రీసెర్చ్ లో తేలింది ఏమిటంటే ఆ చర్చ్ కు దగ్గరలో టాయ్ లెట్స్ లో ఉన్న ప్లంబింగ్ వర్క్ సరిగ్గా లేకపోవడం వలన లోపల డ్రైనేజ్ లోని నీళ్ళు లీకవడం జరిగిందనీ ఆ నీటిని ఈ విగ్రహం అబ్సార్బ్ చేసుకొని ఇలా నీళ్ళు లీకవుతుందని చెప్పారు.

ఇది నమ్మమని చెప్పిన భక్తులకు ప్రూవ్ చేయడానికి  ఆయన ఆ టాయ్ లెట్స్ ను రిపేర్ చేయించారు. అంతే ఆ విగ్రహం నుండి నీళ్ళు రావడం ఆగిపోయింది. నిజంగా ఆ విగ్రహం నుండి వచ్చిన నీరు టాయ్ లెట్ లోనిదే...దాన్నే భక్తులు మూఢ నమ్మకంతో తాగారు. దేవుడు లేడని చెప్పడం మా ఉద్దేశ్యం కాదు. దేవుడు అనేది మన నమ్మకం. దాన్ని మనస్పూర్తిగా నమ్మాలి గాని, కాని అది నమ్మించడానికి దేవుడు అధ్బుతాలు చేస్తాడని చెప్పడం తప్పు. దేవుడిని మనస్పూర్తిగా నమ్మండి. అద్బుతాలను కాదు.

No comments

Powered by Blogger.