గుడిలో బికినీతో ఫోటో షూట్.. హిందువులన్నా.. హిందూ దేవుళ్లన్నా ఇంత చులకనా అంటూ మండిపాటుహిందూ దేవుళ్లను ఎంత వెక్కిరించినా వాళ్లు పట్టించుకోరు.. ఎందుకుంటే వాళ్లకు సహనం ఎక్కువ.. ఉదారస్వభావులు కాబట్టి ఎలా చేసినా చెల్లుద్ది అని సినీ ఇండస్ట్రీ అనుకుంటుంది.. ఈ మధ్య ద్యావుడా సిన్మాలో బీరుతో అభిషేకం చేసి, సిగరేట్ బూడిద రాలుస్తూ, విష్ణుమూర్తి ఫోటో పగులగొడుతూ నానాబీభత్సం చేశారు.. అయినా భజరంగదళ్, విహెచ్ పీ లాంటి సంస్థలు తప్ప సగలు హిందువులు ఎవరూ అంతటా స్పందించలేదు.. ఇలా ఎక్కడో చోట హిందూ దేవుళ్ల విషయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా విశృంఖలంగా వ్యవహరించినా ఎవ్వరూ పట్టించుకోరనే ధీమా ఎక్కవై పోతుంది.. తాజాగా తాజాగా రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ దగ్గర ఓ ప్రసిద్ధ ఆలయంలో జరిగిన తంతు చూస్తే హిందూ వాదులందరికీ ఒళ్లు మండటం ఖాయం.

ఆలయం లోపల ఒక విదేశీ మోడల్ తో బికినీ వేయించి.. ఆమె ఫోటో షూట్ చెయ్యడానికి సిద్ధపడటం వివాదస్పదంగా మారింది.. వాళ్ల కాన్సెప్ట్ ఏంటో.. వాళ్లకు ఎవరు పర్మిషన్ ఇచ్చారో కానీ.. బికినీ ధరించిన ఓ విదేశీ మోడల్ తో పాటు ఒక యూనిట్ ఆ ఆలయం లోపలికి ప్రవేశించింది. ఆ మోడల్ చుట్టూ కొందరమ్మాయిలు చీరలు ధరించి నిలబడి ఉన్నారు. ఇక అంతా ఓకే అనుకోగానే ఫొటో షూట్ మొదలైంది. ఇంతలో ఈ విషయంలో స్థానికులకు తెలిసి పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చారు. ఈ తతంగంపై తీవ్రంగా మండిపడ్డారు. నిర్వాహకుల్ని నిలదీశారు. ఆలయం పవిత్రతను మంటకలిపారంటూ విరుచుకుపడ్డారు. తర్వాత ఆలయ నిర్వాహకుల మీద.. ఈ ఫొటో షూట్ చేసిన వాళ్ల మీదా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయినా ఏ మతాన్ని అయినా కించపర్చడం భావ్యం కాదు..హిందూ దేవాలయాల్లోనే కాదు..క్రిస్టియన్ చర్చీలలోనైనా, ముస్లింల మసీదులలోనైనా ఎలాంటి అసభ్య చర్యలకు పాల్పడకూడదనే కనీస ఇంగిత జ్ఞానం అలవర్చుకుంటే మంచింది..కానీ పవిత్రమైన ప్రార్థనా స్థలాల్లో ఇలాంటి అసభ్య చర్యలకు పాల్పడితే మత ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉంటుంది..మరి రాజస్థాన్ లో జరిగిన ఆలయంలో బికినీ షూట్ ఘటన ఇంకెన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.. 

No comments

Powered by Blogger.