పోర్న్ పిచ్చోడి గురించి మాట్లాడను : పవన్
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్‌పై పవన్ కళ్యాణ్ స్పందించాడు. ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న ట్వీట్స్ ఉద్యమంపై వర్మ ప్రశంసలు గుప్పించాడు. పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు అంటూ వర్మ ట్వీట్స్ చేసిన విషయం తెల్సిందే. ప్రజల పట్ల పవన్ కళ్యాణ్‌కు చాలా శ్రద్ద ఉందని కూడా వర్మ ట్వీట్స్ చేశాడు. ఇదే వర్మ గతంలో పవన్‌ను తీవ్రంగా విమర్శిస్తూ ట్వీట్స్ చేశాడు. అందుకే వర్మ ట్వీట్స్‌ను పవన్ తీవ్ర పదజాలంతో తిప్పి కొట్టే ప్రయత్నం చేశాడు.
నేడు ప్రత్యేక హోదా నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. మీడియా సమావేశం పూర్తి అయిన తర్వాత విలేకరులు వర్మ ట్వీట్స్ గురించి స్పందించాల్సిందిగా కోరిన సమయంలో పవన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పవన్ స్పందిస్తూ... వర్మకు దాదాపు 50 సంవత్సరాలుంటాయి, ఆయన కూతురు వివాహం ఇటీవలే చేశాడు. అలాంటి వర్మ తాను పోర్న్ సినిమాలను చూస్తాను, పోర్న్ సినిమాలు తన వద్ద లెక్కకు మించి ఉంటాయి అని ప్రకటించిన వ్యక్తి గురించి తాను మాట్లాడను. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే స్థాయిలో నేను లేను అంటూ వర్మకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. పవన్ వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తారా స్థాయిలో చర్చ జరుగుతుంది.
No comments