సెక్స్ గురించి టాప్ 5 అపోహలు, అసలు నిజాలు



సెక్స్ అనే పదం ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో, ఆ పదం చుట్టూ అన్ని అపోహలు కూడా ఉంటాయి. సెక్స్ ఎడ్యుకేషన్ తక్కువ, పనికిమాలిన పుస్తకాలు ఎక్కువ ఉన్న మన సమాజంలో అయితే ఈ అపోహలకి కొదువే లేదు. అలాంటి అపోహల్లో టాప్ 5 అపోహలు, అసలు నిజాలు తెలుసుకోండి.

1. అంగం ఎంత పెద్దది అయితే ఆమెకి అంత సుఖం
ఇది ఇంకొక పెద్ద అపోహ. ఈ మధ్య పోర్న్ చూడటం ఎక్కువయ్యాక ఈ ఆలోచన ఎక్కువ అవుతుంది. సినిమా హీరోలంటే అందంగా ఉండాలని ఎలా చూస్తారో, అలాగే పురుషాంగం పెద్దగా ఉన్నవాళ్లకే పోర్న్ స్టార్స్ గా అవకాశాలు వస్తాయి. అది చూసి, తమకి అంత పొడవు లేదని, అందుకే తృప్తి ఇవ్వలేకపోతున్నానని చాలామంది అపోహ పడుతుంటారు. అయితే, నిజానికి పొడవు తక్కువ అయితే అసంతృప్తి మాత్రం ఉండదు. ఏదైనా శారీరక లోపం వల్ల అంగం మరీ చిన్నగా ఉంటె ఇబ్బంది కాని, ఒక అంగుళం అటూ ఇటూగా ఉంటే తృప్తి విషయంలో తేడారాదు.

2. శీఘ్రస్కలనం పెద్ద జబ్బు
శీఘ్రస్కలనం అనేది జబ్బు అని చాలామంది, మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళూ అనుకుంటుంటారు. ఇది అపోహ మాత్రమె. పురుషులు తమ జీవితంలో ఏదో ఒక దశలో శీఘ్రస్కలనం సమస్య ఎదుర్కొంటారు. సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, జీవితంలో వత్తిళ్ళు, అలసట, ఆత్రుత ఇవన్నీ కూడా శీఘ్ర స్కలనానికి కారణాలు. మంచి తిండి, మానసిక ప్రశాంతత ఉంటె శీఘ్రస్కలనం సమస్యని ఈజీగా అధిగమించవచ్చు.

3. కండోమ్ లేకుండా సెక్స్ చేసినా గర్భం రానివ్వని టెక్నిక్
కొంతమంది తాము చాలా తెలివైనవాళ్ళమని, తమ శరీరం తన కంట్రోల్లో ఉంటుందని, సెక్స్ లో ఎంత తన్మయత్వంలో మునిగినా, గర్భం రాకుండా చూడగలనని అనుకుంటారు. స్కలనం జరగబోతుండగా, అంగాన్ని బయటకి తీసేస్తే గర్భం రాదు అని వీళ్ళ నమ్మకం. వీర్య స్కలనం జరిగితేనే గర్భం వచ్చేమాట నిజమే కాని, పురుషాంగం కూడా మానవ శరీరంలో ఒక భాగమే. ఇది కూడా మెదడు ఇచ్చే సూచనలని బట్టి నడుస్తుంది కాని, కొన్నిసార్లు ఆ కమ్యూనికేషన్ మిస్ అవడమో, అప్పుడే స్కలనం కాదు అని అనుకుంటుండగా, కొన్ని చుక్కల వీర్యం విడుదలకావడమో జరుగుతుంది. ఒక్క చుక్క వీర్యం చాలు కదా గర్భం రావడానికి, సో మీరెంత కాలిక్యులేటెడ్ గా ఉన్నా ఒక్కొకసారి గర్భం వచ్చే చాన్సెస్ ఉన్నాయి. గర్భం వద్దు అనుకుంటే, కండోమ్ లేదా ఇతర జాగ్రత్తలు తప్పక తీసుకోండి.

4. తగిన వాతావరణం ఉండాలి
ఇది ఇంకొక అపోహ. మూడ్ రావాలంటే అందుకు తగిన వాతావరణం, పరిస్థితులు ఉండాలని అనుకుంటుంటారు. మంచి డ్రెస్ (అంటే అర్థం అవుతుంది కదా), మంచి ఫిజిక్, కొన్ని భంగిమలు ఉంటేనే మూడ్ వస్తుందనుకుంటారు ఇందులో నిజం లేదు. ఒక్కొకరికి ఒక్కొకలా మూడ్ వస్తుంది. చాలా కాలంగా సెక్స్ కి దూరంగా ఉంటె, లేదా అలాంటి పుస్తకాలూ చదివితే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా రెడీ అయిపోతుంది.

5. ఆ రోజుల్లో సెక్స్ చేస్తే గర్భం రాదు
పీరియడ్స్ టైమ్ లో సెక్స్ లో పాల్గొంటే గర్భం రాదని ప్రపంచ వ్యాప్తంగా ఒక నమ్మకం. ఫలదీకరణం చెందని అండాలు ఆ రోజుల్లో బయటకి వెల్లిపోతుంటాయి, కొత్త అండాలు ఉత్పత్తి కావు అని అందరికీ తెలిసిందే. అయితే, జననాంగంలోకి ప్రవేశించిన శుక్రకణాలు కొన్ని రోజుల పాటు సజీవంగా ఉంటాయి. ఉదాహరణకి పీరియడ్స్ లో రెండో రోజు సెక్స్ లో పాల్గొంటే, విడుదల అయిన శుక్రకణాలు మరో మూడు రోజులు సజీవంగా ఉన్నాయని అనుకుంటే, ఐదో రోజు విడుదల అయే అండంతో, ఇవి కలిసే అవకాశం ఉంటుంది. అప్పుడు గర్భం వచ్చే అవకాశం ఉంది. ఇక కొంతమంది స్త్రీలలో పీరియడ్స్ మూడో రోజే కొద్దిగా అండాలు విడుదల కావచ్చు, అప్పుడు కూడా గర్భం వచ్చే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి గర్భం వద్దు అనుకుంటే కండోమ్ వాడటమే కరెక్ట్.

No comments

Powered by Blogger.