2017 రాశిఫలాలు-ఖచ్చితంగా చేయాల్సినవి..చేయకూడనవి.!!కొత్త సంవత్సరం వస్తోందంటే బోలెడన్ని ఆశలు చిగురిస్తాయి. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవడమే కాదు కొత్త సంవత్సరంలో మన గమనం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలో కలుగుతుంది. గతంలో ఉగాది పండుగకు ఇలాంటి ఆసక్తి ఉండేది. రానురాను నూతన ఆంగ్ల సంవత్సరం కూడా మనకు ఎలా ఉంటుందోనని అందరూ చూసుకునే పరిస్థితి వచ్చేసింది. నక్షత్రాల ఆధారంగా , రాశుల ఆధారంగా, పుట్టిన తేదీల ఆధారంగా కూడా జాతకాలు చెబుతున్నారు. అందుకే 2017 నూతన సంవత్సర శుభవేళ జన్మ నక్షత్ర ప్రకారం,12 రాశుల వారి నూతన సంవత్సర ఫలితాలు.. మన జాతకం ఎలావుంటుందో ఒకసారి తెలుసుకుందాం..


మేషరాశి : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. 
ఈ మాసం ఉత్సాహంగా గడుస్తుంది. పనులు సానుకూలమవుతాయి. సన్నిహితులకు తోడ్పాటు అందిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పెద్దలతో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పరిచయాలు బలపడతాయి. ఆదాయం ఆశాజనకం. వేడుకలు, పండుగలకు బాగా వ్యయం చేస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. గృహంలో సందడి నెలకొంటుంది. నగదు చెల్లింపులు, స్వీకరణలో జాగ్రత్త. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ధనయోగం. అధికారులకు హోదా మార్పు, కొత్త బాధ్యతలు, ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్త్రీల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు పోటీల్లో విజయం సాధిస్తారు.ఇంకా ఉంది

No comments

Powered by Blogger.