పొట్టలో ఒక్కోసారి వినిపించే వింత శబ్దాల వెనుక అసలు రహస్యం..!! తెలిస్తే ఆచ్చర్యపోతారు
అరగని ఆహారం తిన్నా, పొట్ట పట్టకుండా లాగించేసినా, పప్పు ఎక్కువగా తిన్నా ఇంకా ఇలాంటి అనేక సందర్భాల్లో మనకు గ్యాస్‌ట్రబుల్ వస్తుంటుంది. అది వస్తే ఎంతటి ఇబ్బందిగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఒక పట్టాన పోదు. అనేక రకాల సౌండ్స్ పొట్టలోనుంచి, వెనుక నుంచి వస్తుంటాయి. గ్యాస్ అంతా బయటకు పోతుంది.
అయితే గ్యాస్ ఫాం అయితే సౌండ్స్ రావడం మామూలే. కానీ కొన్ని సార్లు బాగా ఆకలిగా ఉన్నప్పుడు, లేదంటే కడుపులో ఏం లేకపోయినా పొట్ట నుంచి చిత్రమైన సౌండ్స్ వస్తుంటాయి. ప్రధానంగా గర్ర్ మనే సౌండ్ వినిపిస్తుంది. అయితే ఇలా సౌండ్ ఎందుకు వస్తుందో మీకు తెలుసా..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం..!
సాధారణంగా మన నోటి నుంచి మొదలయ్యే ఆహార నాళం జీర్ణాశయం మీదుగా సాగి చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, పాయువుతో ముగుస్తుంది. అయితే ఇది అంతా ఒకటే నాళమైనా, మధ్య మధ్యలో వంపులు తిరుగుతూ, ఒక్కో చోట చిన్నగా, ఒక్కో చోట పెద్దగా ఉంటుంది.
అలా ఉన్న నిర్మాణంలో నుంచి మనం తిన్న ఆహారం, ద్రవాలు, ఇతర వాయువులు నెమ్మదిగా కదులుతుంటాయి. అందుకు ఆ నాళం లోపలి వైపు ఉన్న కండరాలు సహాయం చేస్తాయి. అయితే ఆహారమంతా అలా ముందుకు కదులుతున్నప్పుడు ఒక్కోసారి దానిపై కొంత ఒత్తిడి పడుతుంది. ఆ సందర్భంలో పలు రకాల వాయువులు విడులవుతాయి.
అయితే ఆహారం అంతా చిన్న ప్రేగుల నుంచి పెద్ద ప్రేగులకు వెళ్లి జీర్ణాశయం మొత్తం ఖాళీ అయినా కొన్ని వాయువులు అలాగే ఉంటాయి. అవే అలాంటి గర్ర్ మనే సౌండ్ చేస్తాయి. సాధారణంగా ఈ వాయువులు ఎక్కువగా చిన్న ప్రేగుల్లో ఉత్పత్తి అవుతాయి. అలా ఉత్పత్తి అయిన వాయువులే మనకు ఆకలిగా ఉన్నప్పుడు బయటకు వెళ్లాలని ప్రయత్నించి, ఆ క్రమంలో శబ్దాలు చేస్తాయి.
అయితే మనం మళ్లీ ఆహారం తీసుకునేంత వరకు గంటకోసారి 10 నుంచి 20 నిమిషాల వరకు ఈ వాయువులు అలా సౌండ్ చేస్తూనే ఉంటాయి. అదీ కడుపు నుంచి శబ్దాలు రావడం వెనుక ఉన్న అసలు విషయం..!
No comments