రామాయణం తర్వాత రామలక్ష్మణులు ఎలా చనిపోయారో తెలిస్తే షాక్ అవుతారు..


హిందూ పురాణాల్లో ప్రముఖమైన రామాయణం గురించి తెలియని భారతీయులు ఉండరు. రాముడి జ‌న‌నం, రాక్ష‌సుల‌ను సంహ‌రించ‌డం, సీత‌ను ప‌రిణ‌య‌మాడ‌డం, అడ‌వుల‌కు వెళ్లి వ‌న‌వాసం చేయ‌డం, రావ‌ణుడు సీత‌ను ఎత్తుకెళ్ల‌డం, రాముడు రావ‌ణున్ని సంహ‌రించ‌డం.. ఇక ఇంతవరకే అందరికీ తెలిసిన రామాయణం. అయితే రాముడు, ల‌క్ష్మ‌ణులు త‌మ అంత్య కాలంలో ఈ లోకాన్ని ఎలా విడిచిపెట్టి వెళ్లారో చాలా కొద్ది మందికే తెలుసు.
* సీతమ్మకు వనవాసం అనంతరం కొన్నేళ్ల‌కు రాముడు సీత‌ను అయోధ్య‌కు తీసుకువచ్చేందుకు ఉప‌క్ర‌మిస్తాడు. అయితే ఆ సంద‌ర్భంలోనూ రాముడు సీత‌కు అగ్నిప్ర‌వేశం చేయిస్తాడు. దీంతో సీతాదేవి అమితంగా దుఃఖించి ఆ ప‌రీక్షను తిర‌స్క‌రిస్తుంది. అదే స‌మ‌యంలో త‌న త‌ల్లి భూదేవిని ప్రార్థిస్తూ త‌న‌ను ఈ లోకం నుంచి తీసుకువెళ్ల‌మ‌ని వేడుకుంటుంది. దీంతో భూదేవి ఒక్క‌సారిగా భూమి చీల్చుకుని పైకి వ‌చ్చి సీత‌ను త‌న‌తో తీసుకెళ్తుంది.
* సీత వెళ్లిపోయాక రాముడు రాజ్యాన్ని పాలిస్తూ ల‌వ‌, కుశుల‌కు సకల విద్యలు, పరిపాలనా అంశాల్లో తర్ఫీదునిస్తాడు. వారు రాజులుగా రాజ్యాన్ని పాలించే అర్హ‌త వ‌చ్చాక‌, ఒక రోజు రాముడి వ‌ద్ద‌కు య‌మ‌ధర్మ రాజు ఒక రుషి వేషంలో వ‌స్తాడు.

* రామున్ని తీసుకుని కోట‌లో ఉన్న ఓ గ‌దిలోకి వెళ్తాడు. గ‌దికి కాప‌లాగా ల‌క్ష్మ‌ణున్ని నియ‌మిస్తారు. లోప‌లికి ఎవ‌రినీ అనుమ‌తించ‌వ‌ద్ద‌ని సూచిస్తారు.
* అప్పుడు ఆ రుషి (య‌మ ధ‌ర్మ‌రాజు) రాముడితో త‌నువు చాలించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని చెబుతాడు. దీనికి అంగీక‌రించిన రాముడు ఓ శుభ ముహూర్తాన అయోధ్య స‌మీపంలో ఉన్న స‌ర‌యూ న‌దిలోకి వెళ్లి అంత‌ర్థాన‌మ‌వుతాడు. అక్క‌డ రాముడి అవ‌తారం నుంచి మ‌ళ్లీ విష్ణువు అవ‌తారంలోకి మారిపోతాడు.
* రాముడి అనంత‌రం ల‌క్ష్మ‌ణుడు కూడా అదే న‌దిలో త‌న త‌నువు చాలిస్తాడు. త‌న నిజ‌రూప‌మైన శేష‌నాగు అవ‌తారంలోకి మారిపోతాడు. అలా రాముడు, సీత‌, ల‌క్ష్మ‌ణుడు ముగ్గురూ త‌మ అంత్య‌కాలంలో లోకాన్ని విడిచి వెళ్లిపోతారు. ఈ క‌థ గురించి ‘ప‌ద్మ పురాణం’లో వివ‌రించ‌బ‌డింది.

No comments

Powered by Blogger.