ఓ అందమైన భార్య 11 మంది భ‌ర్త‌లు.. ఈ కధేంటో తెలిస్తే షాకవుతారు..


అమ్మాయి అందంగా కనిపిస్తే చాలు గుడ్డిగా నమ్మేస్తారు ఈకాలం అబ్బాయిలు. దీనినే అవకాశంగా చేసుకొని ఒక మహిళ 11 మంది అబ్బాయిలను తన వలలో వేసుకుంది. వివరాలలోకి వెళితే ఇండోర్‌కు చెందిన‌ మేఘా భార్గ‌వ్ అనే 28 ఏళ్ల మ‌హిళ త‌న అందంతో మ‌గ‌వారికి గాలం వేసేది. ఇందుకు మాట్రిమోనీని వేదిక‌గా చేసుకుంది. పెళ్లి కూతురు కోసం మ్యాట్రిమోనీలో ద‌ర‌ఖాస్తు చేసుకున్న యువ‌కుల‌ను టార్గెట్ చేసుకునేది. అందులోను దివ్యాంగులు, న‌లుపు రంగులో ఉండేవారు, విడాకులు తీసుకున్న మ‌గ‌వారినే ప్ర‌త్యేకంగా ఎంచుకుని పెళ్లి చేసుకునేది. కొంత కాలం వారితో కాపురం చేశాకా కూల్ డ్రింక్‌ల‌లో మ‌త్తుమందు క‌లిపి అందిన‌కాడికి దోచుకుని ఉడాయించేది. ఇలా చేస్తూ విలాస‌వంత‌మైన జీవితం గ‌డిపేది. 
ఇదే ప‌ద్ధ‌తిలో కేర‌ళ‌కు చెందిన జ‌స్టిన్ అనే యువ‌కుడిని పెళ్లి చేసుకుని రెండు నెల‌లు కాపురం చేసింది .అనంత‌రం త‌న ద‌గ్గ‌రున్న..

డ‌బ్బు న‌గ‌లు దోచుకుని ప‌రారైంది. గ‌త అక్టోబ‌ర్‌లో రూ.15 ల‌క్ష‌లు న‌గ‌దు తీసుకుని క‌నిపించ‌కుండా పోయింద‌ని కోచి పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు జ‌స్టిన్. కేర‌ళ పోలీసులు నోయిడా పోలీసుల‌తో కలిసి జాయింట్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. చివ‌ర‌కు నోయిడాలోని ఓ ఇంట్లో ఈ మాయ‌లేడిని ప‌ట్టుకున్నారు. మేఘాకు స‌హ‌క‌రించిన సోద‌రి ప్రాచీ, ఆమె భ‌ర్త దేవేంద‌ర్ శ‌ర్మ‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 
త‌న అందంతో మేఘా యువ‌కుల‌కు గాలం వేసి పెళ్లి చేసుకుని కొంత‌కాలం కాపురం చేసి ఆ త‌ర్వాత న‌గ‌లు,డబ్బుతో పారిపోయేద‌ని పోలీసులు తెలిపారు. త‌ను న‌లుగురిని పెళ్లి చేసుకున్న‌ట్లు మేఘా ఒప్పుకుంది. అయితే వారితో విబేధాలు రావ‌డంతోనే వ‌దిలి వెళ్లిపోయిన‌ట్లు బుకాయించి తప్పించుకోవాలనే ప్రయత్నం చేసింది. 

No comments

Powered by Blogger.