నారా బ్రాహ్మ‌ణి కొత్త స‌ర్వే: వైసీపీకే ఎక్కువ సీట్లు



ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం అయ్యాక వ‌రుస‌పెట్టి స‌ర్వేలు చేస్తున్నారు. హైటెక్ ముఖ్య‌మంత్రి కాస్తా స‌ర్వేల సీఎం అయిపోయారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. బాబు సీఎం అయ్యి రెండున్న‌రేళ్లు పాల‌న పూర్త‌య్యింది. ఈ టైంలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే రిజ‌ల్ట్ ఎలా ఉంటుంద‌నే అంశంపై అంద‌రికి స‌హ‌జంగానే ఆస‌క్తి ఉంటుంది.
ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌నే అంశంపై ఇప్ప‌టికే ప‌లు మీడియాల్లో ప‌లు సర్వేలు వ‌చ్చాయి. వీటిల్లో కొన్ని స‌ర్వేలు అధికార టీడీపీకి అనుకూలంగా ఉంటే కొన్ని విప‌క్ష వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. తాజాగా ఓ ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.
ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి రీసెంట్‌గా ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఎవ‌రు గెలుస్తార‌నే అంశంపై రెండుసార్లు స‌ర్వేలు చేయించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. రెండో స‌ర్వేలో ఏపీ సీఎం చంద్ర‌బాబుకు దిమ్మ‌తిరిగేలా రిజ‌ల్ట్ వ‌చ్చిన‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల్లో నిజానిజాలు ఎలా ఉన్నా ఈ మ్యాట‌ర్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే వైసీపీకి 97 చోట్ల గెలిచి జ‌గ‌న్ సీఎం అవుతార‌ని తేలింద‌ట‌. మొత్తం 175 సీట్ల‌లో 97 సీట్ల‌లో వైసీపీ గెలిచి తిరుగులేని ఆధిక్యం సాధిస్తుంద‌ట‌. డ్వాక్రా రుణాలు, రుణ‌మాఫీ, కాపు రిజ‌ర్వేష‌న్లు టీడీపీకి మైన‌స్‌గా మారాయ‌ని ఈ స‌ర్వేలో తేలింద‌ట‌. ఇక మ‌రో ట్విస్ట్ ఏంటంటే టీడీపీ – బీజేపీ – జ‌న‌సేన క‌లిసినా ఈ కూట‌మి కేవ‌లం 70 సీట్ల‌కే ప‌రిమిత‌మ‌వుతుంద‌ట‌. మ‌రి ఈ స‌ర్వే నిజ‌మా ? కాదా ? అన్న‌దానిపై మాత్రం క్లారిటీ లేదు.

No comments

Powered by Blogger.