దారుణం: ప్రముఖ టీవీ నటిని ఆమె ఇంట్లోనే రేప్ చేసి చంపేశారు..మన సమాజంలో రానున్న రోజుల్లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎన్ని సార్లు ఎన్ని చట్టాలు వచ్చినా .. రకరకాల చర్యలు తీసుకుంటున్నా.. వారిపై అత్యాచారాల పర్వం ఏమాత్రం ఆగడం లేదు. ఇంకా రోజు రోజు కి పెరుగుతూనే ఉన్నాయి కానీ.. తగ్గడం లేదు. మన సమాజం లో చిన్నాపెద్దా అని తేడా లేకుండా ప్రతిఒక్కరూ దుండగుల బారినపడి బలైపోతున్నారు. తాజాగా మరో టీవీ నటి బలైంది. కొందరు ఆకతాయిలు ఆమె ఇంట్లోకే చొరబడి ఆమె ను దారుణం హిమ్సింఛి రేప్ చేయడమే కాకుండా అత్యంత దారుణంగా చంపేశారు. ఇంట్లో ఉన్న నగదు, నగల్ని కూడా దొంగలించారు. ఇంత దారుణమైన ఘటన తమిళనాడులోని సాలిగ్రామంలో జరిగింది.
మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జయశీలి (49) అనే నటి టీవీ సీరియల్స్‌లో నటించడమే కాకుండా మోడలింగ్ కూడా చేస్తూ వస్తోంది. సాలిగ్రామంలోని పెరియార్ వీధిలో ఈమె చాలా కాలం నుంచి ఒంటరిగా ఉంటోంది. గత కొద్ది రోజులకి ఈమె ఇంటినుంచి దుర్వాసన వస్తుండడంతో.. చుట్టుపక్కలవాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమె ఇంటికి చేరుకున్నారు ఇంట్లో జయశీలి నగ్నదేహం ఉండడం, పక్కనే కండోమ్ ప్యాకెట్స్ లభించడంతో.. ఆమెని రేప్ చేసి చంపేశారని పోలీసులు నిర్ధారించారు. హత్యకుముందు ఆమెపై అత్యాచారం జరిపి.. ఆ తర్వాత ఊపిరాడకుండా చంపినట్లు వారు పేర్కొంటున్నారు.

అక్కడ పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే.. ఇది తెలిసినవాళ్ల పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కా ప్లానింగ్ ప్రకారమే ఆమెని చంపేశారని, వెంటనే దుండుగుల్ని పట్టుకుంటామని తెలిపారు. స్నిఫర్ డాగ్స్‌ని తీసుకొచ్చి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల తమిళనాడులో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతుండడంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. 

No comments

Powered by Blogger.