స్నేహితుడి ఫోనులో తన భార్య నెంబర్ చూసి...!! ఏం చేసాడంటే


అక్రమసంబంధం ఇద్దరి స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది. చివరికి ప్రాణాలు పోయేవరకు తీసుకొచ్చింది. తన స్నేహితుడి భార్య ఫోన్ నెంబర్ అతని మొబైల్లో సేవ్ చెయ్యటమే అతని పాలిట యమపాశం అయింది. వివరాలలోకి వెళితే...
రామన్, చంద్రశేఖర్ అనే ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఇద్దరూ కలిసి ఒకసారి ఉద్యోగరీత్యా వేరే ఊరికి వెళ్ళవలిసి వచ్చింది. అలా దారిలో ఒకొఅ బార్ షాప్ కి వెళ్లి బాగా మద్యం సేవించారు. ఆతరువాత చంద్రశేఖర్ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోవడంతో ఒకసారి ఇంటికి ఫోన్ చెయ్యాలని చెప్పి రామన్ ఫోన్ తీసుకున్నాడు. నెంబర్ టైపు చేసి డయల్ చెయ్యగా తన భార్య నెంబర్ సేవ్ చేసి ఉంది. అది చూసి తాగిన మత్తులో కోపంతో ఊగిపోయాడు. తన భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నావంటూ రామన్‌తో చంద్రశేఖరన్‌ గొడవ పడినట్లు తెలిపారు. అలాంటిదేమి లేదని చెప్పినా వినకుండా చంద్రశేఖరన్ పెద్ద గొడవే చేశాడు..అంతటితో ఆపకుండా నా భార్యతో నీవు ఎక్కడెక్కడ తిరిగావో చెప్పాలంటూ ప్రశ్నించాడు. గొడవ సద్దుమనుగుతానే అక్క డి నుంచి బయలుదేరారు, మార్గమధ్యంలో మళ్లీ గొడవ మొదలుపెట్టాడు చంద్రశేఖరన్, నీ సెల్ ఫోన్‌లో నా భార్య నెంబర్ ఎందుకుందంటూ అతనని ప్రశ్నించి

దిన్నెమీద పల్లె బస్టాప్‌ సమీపంలో రామన్‌ను కాలితో తన్నగా అతడు కింద పడినట్లు తెలిపారు. దిగి చూస్తే శ్వాస ఆడక పోవడంతో మృతి చెందాడని గ్రహించి పారిపోయారన్నారు. తిరిగి 10 రోజులకు చిన్నమండెం స్టేషన్‌కు వచ్చి మృతుడు తమ వాడేనని ఏవిధంగా కేసు నమోదు చేశారో తెలుసుకుని భార్యాపిల్లలను తీసుకువస్తానని వెళ్ళిపోయినట్లు తెలిపారు. రామన్‌ భార్య కేసు పెట్టడంతో హత్య విషయం వెలుగు చూసిందని వివరించారు. ఇందులో నిందితుడు చంద్రశేఖరన్‌ను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు.

No comments

Powered by Blogger.