హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్‌ చార్జి కలిపితే చెల్లించకండి: ప్రభుత్వం స్పష్టమైన ఆదేశం



హోటళ్లు, రెస్టారెంట్లకు సర్వీసు చార్జీలు చెల్లించడం పూర్తిగా వినియోగదారుల విచక్షణే. తమకు అందిన సేవలపై వినియోగదారులు సంతృప్తి చెందకపోతే సర్వీస్‌ చార్జీ, టిప్‌ చెల్లించాల్సిన పని లేదు. ఒకవేళ బిల్లులోనే సర్వీసు చార్జీని కూడా కలపాలంటే వినియోగదారుల నుంచి ముందుగానే అనుమతి తీసుకోవాలి. వాస్తవానికి బిల్లులోనే 12.5శాతం వ్యాట్‌, 6శాతం సర్వీస్‌ ట్యాక్స్‌ను రెస్టారెంట్లు వసూలు చేస్తున్నందున... ప్రత్యేకంగా సర్వీస్‌ చార్జి చెల్లించాల్సిన పని లేదు. కానీ, పలు ప్రాంతాల్లో ‘టిప్‌’ పేరుతో సుమారు 10శాతం వరకూ సర్వీసు చార్జి వసూలు చేస్తున్నారు. వినియోగదారుల హక్కులను హరిస్తూ, వారి విచక్షణకు సంబంధించిన ఈ విషయంలో రెస్టారెంట్లు చేస్తున్న దోపిడీపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. 

No comments

Powered by Blogger.