2017 లో న్యుమరాలజీ ప్రకారం మీ అదృష్ట సంఖ్యలు ఇవే...


న్యూమరాలజీ‌ ఆధారంగానే చాలా మంది వృత్తి, సంపాదన, అదృష్టం గురించి ఆరా తీస్తుంటారు. న్యుమరాలజీ సంఖ్యల ఆధారంగా వ్యక్తిగత ప్రాధాన్యతలను, ఉత్సాహాలను న్యుమరాలజిస్ట్‌లు నిర్ణయిస్తారు. జీవిత భాగస్వామిపై ప్రేమ, ఇతర అంశాలను కనుగొనడానికి, పరిశీలనకు న్యుమరాలజీ సహాయ పడుతుంది. 2017లో మీ అదృష్టం సంఖ్యలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మీరు 1, 10, 19, 28 తేదీల్లో జన్మిస్తే మీలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఇలాంటి వాళ్లు తమ జీవిత భాగస్వామిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తారు. ఏ విషయంలోనూ రాజీ పడరు కాబట్టి కాలక్రమేణా ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. చిన్ననాటి ప్రియురాలు లేదా ఆసాధారణ వ్యక్తులతో ప్రేమలో పడితే అందులో నుంచి తప్పించుకోవడం కష్టం.

2,11,20,29 తేదీల్లో జన్మించివారు విఙ్ఞాన‌వంతులు, సున్నితమైనవారే కాదు ముభావంగానూ ఉంటారు. తమ ప్రేమికులతో శారీరక, మానసిక అనుబంధాన్ని కలిగి ఉంటారు. ఈ తేదిల్లో పుట్టిన వారికి మానసిక ఉల్లాసం, ఊహాత్మక శక్తి జన్యువుల ద్వారా సంక్రమిస్తుంది కాబట్టి తమ భావాలను, స్నేహ పరిమితులను అవగాహనతో అర్థం చేసుకునే వ్యక్తులను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.

3, 12, 21, 30 తేదిల్లో జన్మించినవారికి ధైర్యం ఎక్కువ. వారి మనసుకు నచ్చిన పనే చేస్తారు. ఏవరి నుంచి ప్రేమను కోరుకుంటారో వారిపట్ల బాధ్యతగా వ్యవహరించాలి.

4, 13, 22, 31 తేదిల్లో పుట్టిన వ్యక్తులు ప్రకృతి ప్రేమికులు. వీరు ప్రేమ ద్వారా ఏమి కోరుకుంటున్నారో విశ్లేషించాల్సిన అవసరం ఉంది. భాగస్వామి పట్ల విధేయులై ఉన్నప్పటికి కొన్ని సందర్భాల్లో వివాహేతర సంబంధాలకు మెగ్గుచూపుతారు.

5, 14, 23 తేదిల్లో జన్మించినవారు బహుముఖ ప్రఙ్ఞావంతులే కాకుండా అన్ని విషయాల్లో ప్రయోగాత్మకంగా వ్యవహరిస్తారు. ఉల్లాసంగా ఉంటారు. ప్రస్తుత, వర్తమానంలో జరిగే విషయాలపై జాగ్రత్తగా ఉంటారు.

6, 15, 24 తేదిల్లో పుట్టిన వ్యక్తులు ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తారు. వీరి మనస్తత్వం చంపు లేదా చావు అన్న రీతిలో ఉంటుంది. అలాగే ప్రేమలో నిస్వార్థమైన త్యాగాన్ని కోరుకుంటారు. భాగస్వామిపై ప్రేమతోనూ, కరుణతోనూ వ్యవహరిస్తారు కాబట్టి వీరిని అందరూ ఇష్టపడతారు.

7, 16, 25 తేదీలు పుట్టిన రోజు కలిగిన వ్యక్తులు తెలివైనవారు. జీవితం గురించి కలలు కంటారు. జీవిత భాగస్వామి అన్ని విషయాల్లోనూ కచ్చితంగా ఉండాలని కోరుకుంటారు కానీ అది సాధ్యం కాదు. భాగస్వామిలో ఉండే మంచి లక్షణాల కారణంగా మీ లోపాలను సరిదిద్దుకుని బలహీనతలను అధిగమిస్తారు.

8, 17, 26 తేదీల్లో పుట్టినవారు అత్యంత నమ్మకస్తులే కాదు అభిమానవంతులు కూడా. అయితే భారీ అంచనాల కారణంగా ప్రేమ, వివాహ సంబంధాలు దెబ్బతిని ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీ మనస్తత్వాన్ని అర్థం చేసుకుని, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే వ్యక్తులను ఎంపిక చేసుకోవాలి.

9, 18, 27 తేదిల్లో పుట్టిన వ్యక్తులు ప్రతి చిన్న విషయాలకు అతిగా స్పందించి, ఎక్కువ బాధ పతడారు. ఇలాంటి వాటిని పట్టించుకోకుండా ఉంటే జీవిత భాగస్వామితో ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. అంతేకాకుండా భార్యాభర్తలు ఇద్దరిలోను అపారమైన ప్రేమ ఉంటుంది.

No comments

Powered by Blogger.