రాశి ఖన్నాకు ఆ కోరికలు చాలా ఎక్కువట...!



ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలివుడ్ ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరోయిన్ రాశిఖన్నా తక్కువ కాలంలోనే తన హాట్ అందాలతో అగ్ర హీరోయిన్ గా వెలుగొందుతోంది. ఈ అమ్మడు తన గ్లామర్ పాత్రలతో కుర్రకారుకు మతిపోయేలా చేస్తోంది. ప్రస్తుతం టాలివుడ్ లో కుర్ర హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, లావణ్యా త్రిపాఠి, రేజీనా వంటి హీరోయిన్లకు మంచి పోటీని ఇస్తోంది. అయితే రాశీఖన్నా గురించి కొన్ని ఆసక్తికర నిజాలు ఆమె నోటినుంచే వెలువడ్డాయి. ఇక ముద్దుగా ఉండే రాశీఖన్నా తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెపుతూ..

అప్పట్లో తనకు పెళ్లి చేసుకొని సుఖంగా సంసారం చేస్తూ ఇద్దరు పిల్లలను కనాలని, తనకు ఎప్పుడు 23 ఏళ్ళు ఒంటి మీదకు వస్తాయా ? ఎప్పుడు పెళ్లి చేసుకుంటానా ? ఎప్పుడు విరహ తాపాన్ని తీర్చుకుంటానా ? అని తెగ ఆలోచనలు చేసేదట. సంసారం, మొగుడు, పిల్లలు అంటూ రకరకాలుగా ఆలోచించేదట. ఎప్పుడైతే తన చిత్రాలు మంచి సక్సెస్ అందుకున్నాయో ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు రావడం మొదలైందో ఆ ఆలోచనలన్నీ దూరమయ్యాయట. అప్పటి నుండి మాత్రం తన మైండ్ సెట్ మారిపోయిందట. ఇప్పుడు హీరోయిన్ గా బిజీగా ఉండటం వల్ల అలాంటి ఆలోచనలు లేవంట. పైగా అప్పటి ఆలోచనలు తల్చుకుంటే సిగ్గేస్తోంది.. నవ్వొస్తోంది అంటుంది రాశి ఖన్నా.

No comments

Powered by Blogger.