జయలలిత మృతి పట్ల అనుమానానికి తెర లేపుతున్న 8 ప్రశ్నలు... కావాలనే చంపేశారా...??



తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. అయితే ఆమె మరణంపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఓ 8 ప్రశ్నలపై ప్రజల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమివ్వగలిగితేనే సందేహాలకు తొలగుతాయని చర్చించుకుంటున్నారు. ఆ ఎనిమిది ప్రశ్నలివే
1. సెప్టెంబర్ 22న జయలలిత డీహైడ్రేషన్‌తో బాధపడుతూ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. సరిగ్గా ఆమె ఆస్పత్రిలో చేరిన రెండో రోజు, అంటే సెప్టెంబర్ 23న అపోలో ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. జయలలిత జ్వరం, డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నారని, ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని, అబ్జర్వేషన్‌లో ఉంచామనేది ఆ ప్రెస్ నోట్ సారాంశం. జ్వరం, డీహైడ్రేషన్ మాత్రమే అయితే 75రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఉందా అనేది మొదటి ప్రశ్న.
2. అదే రోజు మరో ప్రెస్ నోట్‌ను ఆస్పత్రి విడుదల చేసింది. ఆమెకు జ్వరం తగ్గిపోయిందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని అందులో ఉంది. ఆమె సాధారణ స్థితిలోనే ఉంటే ఎందుకు ఎవర్ని ఆస్పత్రిలోకి అనుమతించలేదనేది రెండో ప్రశ్న.
3. నవంబర్ 19న అన్నాడీఎంకే అధికారిక ట్విటర్ అకౌంట్‌లో పురుచ్చి తలైవి అమ్మను ఐసీయూ నుంచి జనరల్ వార్డ్‌కు తరలించారని ట్వీట్ చేశారు. జనరల్ వార్డుకు తరలించిన కొద్దిరోజులకే మళ్లీ ఆరోగ్యం ఇంతలా క్షీణించిందా అనేది మూడో ప్రశ్న.
4. జయలలిత ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్న ఫోటో ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో హల్‌చల్ చేసింది. ఆ తర్వాత అది ఫేక్ అని తేలింది. 75 రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ముఖ్యమంత్రికి సంబంధించిన ఏ ఒక్క ఫోటోను కూడా విడుదల చేయకపోవడానికి కారణం ఏంటనేది నాలుగో ప్రశ్న.

5. ఓ పాపులర్ తమిళ ఛానల్ అధికారిక ట్విటర్ అకౌంట్‌లో జయలలిత చనిపోయారంటూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత కొన్ని ఒత్తిళ్లకు తలొగ్గి ఆ ట్వీట్‌ను తొలగించింది. ఆమెకు ఏ హాని జరగకపోతే ఈ ఛానల్ చెబుతుంది అబద్ధం వాస్తవమిది అని జయకు సంబంధించిన ఏ ఒక్క ఆధారాన్ని ఎందుకు చూపించలేకపోయారనేది ఐదో ప్రశ్న.
6. జయలలిత క్షేమంగానే ఉండి ఉంటే అన్నాడీఎంకే నేతలు ముందుగానే పన్నీరు సెల్వంను తమ ముఖ్యమంత్రిగా ఎలా నిర్ణయించి ఉంటారు? అన్నాడీఎంకే నేతలకు జయలలిత చనిపోయిన విషయం ముందే తెలుసా అనేది ఆరో ప్రశ్న.
7. ఈ విషయాలన్నింటినీ పక్కనపెట్టినా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌ను అపోలో ఆస్పత్రిలోకి అనుమతించలేదు. అంటే జయలలిత ఏ స్థితిలో ఉందన్న విషయాన్ని సొంతవారికి కూడా తెలియకుండా రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటనేది ఏడో ప్రశ్న. ఇక్కడ మరో విషయమేంటంటే, జయలలిత మృతికి సంబంధించిన కొన్ని కీలక విషయాలను త్వరలో వెల్లడిస్తానని దీపా ప్రకటించడంతో ఏం చెబుతుందోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
8. జయలలిత చనిపోయిన విషయాన్ని 75 రోజులు అపోలో ఆస్పత్రి గోప్యంగా ఉంచింది. జయ చనిపోయిన తర్వాత ఆమె చికిత్సకు సంబంధించిన చిత్రాలను కానీ, సీసీ టీవీ పుటేజిలను కానీ విడుదల చేయడంలో అపోలో ఆస్పత్రికున్న అభ్యంతరాలేంటనేది ఎనిమిదో ప్రశ్న. అయితే, ఎందుకు సీసీ టీవీ ఫుటేజిలను విడుదల చేయాలనే ప్రశ్న తలెత్తొచ్చు. ప్రజల్లో ఉన్న సందేహాల తొలగాలంటే ఖచ్చితంగా చికిత్సకు సంబంధించిన దృశ్యాలను విడుదల చేయాల్సిందేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

No comments

Powered by Blogger.