జియో ఆఫ‌ర్‌కే బంప‌ర్ ఆఫ‌ర్‌



ఉచిత ఇంట‌ర్నెట్‌, కాల్స్‌తో ఇండియ‌న్ టెలికం రంగంలో పెను సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన రిల‌య‌న్స్ జియో వ‌రుస ఆఫ‌ర్ల‌తో మిగిలిన టెలికం కంపెనీల‌కు పెద్ద షాక్ ఇస్తోంది. ఈ క్ర‌మంలోనే జియో త‌న ఉచిత వెల్ కం ఆఫ‌ర్‌ను ముందుగా ఈ యేడాది డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు ప్ర‌క‌టించింది. ఆ త‌ర్వాత దానిని వ‌చ్చే యేడాది మార్చి 31 వ‌ర‌కు పొడిగించింది. ఇప్పుడు ఈ ఆఫ‌ర్‌ను మరో రెండు నెలలపాటు పొడిగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంటే మే నెల వరకు ఆఫర్ ఉంటుందన్న మాట.

ఈ ఏడాది డిసెంబరుతో ముగియనున్న ఆఫర్‌ను ఇటీవల ఆ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ‘జియో’ దెబ్బకు పోటీ సంస్థలు దిగివచ్చి ఉచిత ఆఫర్లు ప్రకటిస్తుండడంతో వాటికి మ‌రోసారి షాక్ ఇచ్చేందుకు ముఖేష్ ఈ ఆఫ‌ర్ పొడిగించాడు. ఈ దెబ్బ‌తో పోటీ కంపెనీల వైపు ఎవ్వ‌రూ కూడా చూసే ప్ర‌శ‌క్తేలేదు.

ప్ర‌స్తుతం మార్కెట్లో త‌మ‌కు ఉన్న వాటాను వ‌దులుకునేందుకు సిద్ధంగా లేని కంపెనీలు జియో ఉచిత ఆఫ‌ర్ పోటీని త‌ట్టుకునేందుకు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే కొంద‌రు వినియోగ‌దారులు జియో వైపు మ‌ర‌లుతున్నారు. ఈ క్ర‌మంలోనే జియో త‌న ఉచిత ఆఫ‌ర్‌ను మ‌రింత పొడిగించి ఆ కంపెనీల‌కు మ‌రింత షాక్ ఇచ్చింది.

No comments

Powered by Blogger.