హ‌స్త ప్ర‌యోగం శృతి మించితే ఎలాంటి అనారోగ్య ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా..?


హస్త ప్ర‌యోగం… త‌మ‌లో క‌లిగిన శృంగార వాంఛ‌ల‌ను పూర్తి చేసుకోవ‌డానికి పురుషులు అనుస‌రించే ఓ విధానం. హ‌స్త ప్ర‌యోగం చేసుకోవ‌డం మంచిదేన‌ని వైద్యులు చెబుతుంటారు. దీని వ‌ల్ల మాన‌సిక ఒత్తిడి నుంచి కొంత ఊర‌ట ల‌భిస్తుంద‌ని, శ‌రీరం ఉత్తేజం చెందుతుంద‌ని, ఆరోగ్యానికి కూడా మంచిద‌ని వారి అభిప్రాయం. కానీ కొన్ని వ‌ర్గాల్లో మాత్రం ఇలా చేయ‌డం పాపంగా ప‌రిగ‌ణిస్తారు. స‌రే, పురుషులు హ‌స్త ప్రయోగం చేసుకోవ‌డం మాట ఎలా ఉన్నా, అది శృతి మించితే దాని వ‌ల్ల ప‌లు ర‌కాల అనారోగ్య ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ట‌. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వ్య‌స‌నంగా మారుతుంది
తాగుడు, జూద‌మాడ‌డం వంటి చెడు అల‌వాట్లు వ్య‌స‌నాలుగా ఎలా మారుతాయో హస్త ప్ర‌యోగం శృతి మించితే అది కూడా వ్య‌స‌నంగా మారుతుంద‌ట‌. నిత్యం దాని కోసం ప‌రి త‌పిస్తూ ఉంటార‌ట‌. అది లేనిదే ఉండ‌లేర‌ట‌. డ్ర‌గ్స్‌కు బానిస‌లైన‌ట్టుగా వారి జీవన విధానం ఉంటుంద‌ట‌.

కండరాలపై ప్ర‌భావం
హ‌స్త ప్ర‌యోగం ఎక్కువ‌గా చేసుకోవ‌డం వ‌ల్ల చేతుల‌పై ఎక్క‌గా ప్ర‌భావం ప‌డి త‌ద్వారా కండ‌రాలు కోల్పోవాల్సి వ‌స్తుంద‌ట‌. కండ‌ల ద్ర‌వ్య‌రాశి, ప‌రిమాణం త‌గ్గుతుంద‌ట‌.

శృంగారంపై అనాస‌క్త‌త‌
హ‌స్త ప్ర‌యోగం ఎక్కువ‌గా చేసుకునే పురుషుల‌కు శృంగారంపై ఆస‌క్తి త‌గ్గిపోతుంద‌ట‌. భాగ‌స్వామితో శృంగారంలో పాల్గొనేందుకు ఆస‌క్తిని చూపించ‌ర‌ట‌. ఇది దాంప‌త్య జీవితానికి అంత మంచిది కాద‌ని నిపుణుల అభిప్రాయం.

వెన్ను నొప్పి
బాగా వెన్ను నొప్పి వ‌స్తున్నా కూడా అందుకు శృతి మించిన హ‌స్త ప్ర‌యోగం కూడా ఓ కార‌ణ‌మై ఉంటుంద‌ట‌. క‌నుక అలాంటి వారు ఎక్కువ‌గా చేయ‌కుండా ఉండ‌డ‌మే మంచిది. లేదంటే వెన్ను నొప్పి ఇంకా తీవ్ర‌త‌ర‌మ‌వుతుంద‌ట‌.

ఏకాగ్ర‌త‌
హ‌స్త ప్ర‌యోగం ఎక్కువ‌గా చేసే పురుషుల‌కు మాన‌సిక ఏకాగ్ర‌త ఉండ‌ద‌ట‌. ఎప్పుడూ ఏదో ఒక విష‌యం ఆలోచిస్తూ చేసే ప‌నిపై దృష్టి స‌రిగ్గా పెట్ట‌ర‌ట‌. ఏకాగ్ర‌త‌ను కోల్పోతార‌ట‌.

తొంద‌ర‌పాటు
శృతి మించి హ‌స్త ప్రయోగం చేసే వారు ఎల్ల‌ప్పుడూ తొంద‌ర‌పాటుగా ఉంటార‌ట‌. ఆతుర‌త‌, కంగారు వంటి స్థితుల‌ను ప్ర‌దర్శిస్తూ ఉంటార‌ట‌.

విప‌రీతమైన నొప్పి, మంట‌
ఇక చివ‌రిగా… హ‌స్త ప్ర‌యోగం ఎక్కువ‌గా చేసే పురుషుల‌కు వ‌చ్చే కామ‌న్ స‌మ‌స్య‌… అంగం బాగా నొప్పిగా, మంట‌గా ఉండ‌డం. ఈ స‌మ‌స్య త‌గ్గాలంటే హ‌స్త ప్ర‌యోగం అంత‌గా చేయ‌కూడ‌ద‌ట‌. లేదంటే అది ఇంకా విప‌రీత‌మైన అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను క‌లిగిస్తుంద‌ట‌.

No comments

Powered by Blogger.