2017 రాశిఫలాలు-ఖచ్చితంగా చేయాల్సినవి..చేయకూడనవి-2

వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహణి, మృగశిర 1, 2 పాదాలు. 
ఆకస్మికంగా కొన్ని వ్యవహారాలు సానుకూలమవుతాయి. స్థిరాస్తి మూలక ధనం అందుతుంది. మానసికంగా కుదుటపడతారు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సహాయం క్షేమం కాదు. వస్త్రాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. అత్యుత్సాహాన్ని అదుపు చేసుకోండి. సంతానం రాక సంతోషాన్నిస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఆశాదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. దైవదర్శనంలో ఒకింత ఇబ్బందులు తప్పవు. బెట్టింగ్‌లు, జూదాల జోలికి పోవద్దు.ఇంకా ఉంది

No comments

Powered by Blogger.